Fri. Dec 27th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, 11 మే 2024:ఓటింగ్ ఆవశ్యకత పట్ల అవగాహన కల్పించటం లో భాగంగా,భారతదేశంలోని అతిపెద్ద అమ్యూజ్మెంట్ పార్కు అయిన వండర్లా హాలిడేస్ లిమిటెడ్, తాము ఓటు వేసినట్లుగా ఎన్నికల అధికారులు వేసే సిరా గుర్తును చూపించే కస్టమర్లకు తమ హైదరాబాద్ పార్క్కి టిక్కెట్లపై 20% తగ్గింపును అందిస్తామని ప్రకటించింది.

వండర్లా హైదరాబాద్ పార్క్ లో 2024 మే 13, 14 & 15 తేదీల్లో ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బుకింగ్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఆఫర్ను పొందేందుకు, పార్క్ ప్రవేశ ద్వారం వద్ద సిరా వేసిన వేలును చూపవలసి ఉంటుంది.

ఈ కార్యక్రమం గురించి వండర్లా హాలిడేస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ చిట్టిలపిల్లి మాట్లాడుతూ, “బాధ్యతగల పౌరులుగా, ఓటు వేయడం మన కర్తవ్యం. ఓటు వేయమని వ్యక్తులను ప్రోత్సహించడంలో ఈ కార్యక్రమం మేము వేసిన అతి చిన్న అడుగు అని వండర్లా వద్ద మేము గట్టిగా నమ్ముతున్నాము” అని అన్నారు.

వండర్లా తమ సందర్శకులను ఆన్లైన్ వెబ్సైట్: https://www.wonderla.com/ ద్వారా లేదా 084 146 76333, +91 91000 63636కు కాల్ చేయటం ద్వారా ముందుగా తమ ఎంట్రీ టిక్కెట్లను బుక్ చేసుకోమని ప్రోత్సహిస్తుంది.

Also read : Cast your vote and get 20% off on Wonderla Hyderabad Park tickets!

ఇది కూడా చదవండి: వేసవి శిబిరాన్ని ప్రారంభించిన స్కోడా ఇండియా

ఇది కూడా చదవండి: రూ.15వేల లోపు 5G స్మార్ట్‌ఫోన్స్..జాబితా..

ఇది కూడా చదవండి: 2024… జగనన్న వన్స్ మోర్

ఇది కూడా చదవండి: పురూహుతికా అమ్మవారిని దర్శించుకున్నరామ్ చరణ్

error: Content is protected !!