365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఫిబ్రవరి 4,2025: వికసిత భారత్ లక్ష్యంతో సమ్మిళిత అభివృద్ధికి మద్దతుగా 2025 కేంద్ర బడ్జెట్ రూపొందించిందని ఫ్లెక్స్‌పే బై వివిఫై (FlexPay by Vivifi) సీఈవో,వ్యవస్థాపకుడు అనిల్ పినపాల తెలిపారు.
ఈ బడ్జెట్ గత బడ్జెట్‌లతో పోలిస్తే ఎంతో ప్రగతిశీలంగా ఉండటంతో పాటు, వ్యాపార వృద్ధి, వ్యవసాయ రంగ బలోపేతం, స్టార్టప్‌లకు మద్దతు వంటి కీలక రంగాలకు ఊతమిచ్చే విధంగా ఉందన్నారు.
అసంఘటిత రంగాన్ని ప్రోత్సహించే ప్రణాళికలు
ఈ బడ్జెట్‌లో వీధి వ్యాపారులకు రుణం కల్పన, ఎంఎస్ఎంఈ నిర్వచన విస్తరణ, స్టార్టప్‌లకు విస్తృత రుణ సహాయం వంటి అంశాలు దేశ ఆర్థిక వృద్ధికి దోహదం చేసేలా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
అంతేకాకుండా, రైతులకు అందించే రుణ పరిమితిని 60% పెంచడం, నేరుగా క్రెడిట్ కార్డుల ద్వారా నిర్వహణ మూలధన రుణ సదుపాయం కల్పించడాన్ని విప్లవాత్మక చర్యగా అభివర్ణించారు.
పన్ను తగ్గింపుతో ప్రజలకు మేలు
వ్యక్తిగత ఆదాయ పన్నులో తగ్గింపుతో ప్రజల వద్ద డిస్పోజబుల్ ఆదాయం పెరిగి, వినియోగ వ్యయాలు అధికమవుతాయని, ఇది ఆర్థిక వృద్ధికి ఊతమివ్వగలదని అనిల్ పినపాల అన్నారు.
ఇన్నోవేషన్, ఏఐ, పెట్టుబడులకు ఊతం
ఈ బడ్జెట్‌లో ఇన్నోవేషన్ ఫండ్‌ల ఏర్పాటు, సెంటర్ ఫర్ ఏఐ ఎక్సలెన్స్ వంటి ప్రతిపాదనలు, కొత్త ఉద్యోగ అవకాశాల కల్పనకు, భారతదేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి దోహదపడతాయని తెలిపారు. అంతేగాక, విదేశీ పెట్టుబడులకు మరింత పారదర్శకత, పన్ను విధానాల్లో స్పష్టత తీసుకురావడం ముఖ్యమైన అడుగుగా అభివర్ణించారు.
వ్యాపారాలకు మరింత సౌలభ్యం
వ్యాపార నిర్వహణను సులభతరం చేయడంపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు హర్షణీయమని, విశ్వసనీయత ఆధారిత విధానానికి మంత్రిత్వ శాఖ ప్రాధాన్యం ఇవ్వడం కంపెనీల నిబంధనల భారం తగ్గించేందుకు దోహదం చేస్తుందని అనిల్ పినపాల వ్యాఖ్యానించారు