365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 28,2024: సుజుకి తన హయబుసా మోటార్‌సైకిల్ 2025 మోడల్‌ను గ్లోబల్ మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. ఈ కొత్త మోడల్ కొన్ని ఆకర్షణీయమైన రంగులు, ఫీచర్లతో అప్‌గ్రేడ్ చేసింది. అయితే, ఇంజిన్,మెకానికల్ భాగాలలో ఎలాంటి మార్పులు చేయలేదు. 2025 సుజుకి హయబుసాలో ఏం ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయో తెలుసుకుందాం.

2025 సుజుకి హయబుసా మూడు కొత్త రంగు ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది:

  1. మెటాలిక్ మ్యాట్ గ్రీన్ / మెటాలిక్ మ్యాట్ టైటానియం సిల్వర్
  2. గ్లాస్ స్పార్కిల్ బ్లాక్
  3. మెటాలిక్ మిస్టిక్ సిల్వర్ / పెరల్ వైగర్ బ్లూ

ఈ కొత్త రంగులు హయబుసాకు మరింత ఆకర్షణీయమైన రూపాన్ని ఇస్తాయి రైడర్‌లకు కొత్త ఎంపికలను అందిస్తాయి.

2025 మోడల్‌లో లాంచ్ కంట్రోల్ ఫీచర్ మెరుగ్గా రూపొందించింది. అలాగే స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్ సిస్టమ్ కూడా అందుబాటులో ఉంది. ఇది రైడర్ గేర్ మార్చినప్పుడు, ముఖ్యంగా క్విక్ షిఫ్టర్ ఉపయోగించినప్పుడు ఆటోమేటిక్‌గా ఆఫ్ కాకుండా కొనసాగుతుంది, దాంతో ట్రాక్‌లో మెరుగైన పనితీరును సాధించడానికి సహాయం చేస్తుంది.

2025 సుజుకి హయబుసా 1340cc ఇన్‌లైన్ 4-సిలిండర్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ 190 bhp శక్తిని, 142 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని మేకానికల్ భాగాలు 6-స్పీడ్ గేర్‌బాక్స్, అసిస్టెంట్,స్లిప్పర్ క్లచ్, క్విక్ షిఫ్టర్‌తో అమర్చాయి.

హయబుసాలో పలు కొత్త ఎలక్ట్రానిక్ ఫీచర్లు చేర్చారు:

  • బహుళ పవర్ మోడ్‌లు
  • యాంటీ-లిఫ్ట్ కంట్రోల్
  • ఇంజిన్ బ్రేక్ కంట్రోల్
  • యాక్టివ్ స్పీడ్ లిమిటర్
  • హిల్ హోల్డ్
  • క్రూయిజ్ కంట్రోల్
  • ABS

ఈ ఫీచర్లు బైక్‌ను మరింత సురక్షితంగా, సులభంగా నడిపించేలా చేస్తాయి.

హయబుసా సూపర్ స్పోర్ట్ బైక్‌గా ఉండటంతో, ఇందులో అద్భుతమైన బ్రేకింగ్ సిస్టమ్ అందించింది. ఇందులో బ్రేమ్‌బో కాలిపర్‌లు, KYB ఫోర్క్స్ సస్పెన్షన్ ఉన్నాయి, ఇవి బైక్‌కు మెరుగైన స్థిరత్వం, సౌకర్యాన్ని ఇస్తాయి.

భారతదేశంలో 2025 సుజుకి హయబుసా ఎక్స్-షోరూమ్ ధర ₹16.90 లక్షలు. ఈ మోడల్‌ను త్వరలో భారత మార్కెట్‌లో విడుదల చేయవచ్చని అంచనా వేయనుంది. ఈ మోడల్‌ను ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో ప్రదర్శించవచ్చు.