Mon. Dec 23rd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, జనవరి 9,ఢిల్లీ,2022: తెలంగాణ ప్రభుత్వ సహకారంతో కేంద్ర పరిపాలనాసంస్కరణల శాఖ, ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలు ఈ-పరిపాలనపై రెండు రోజుల పాటు నిర్వహించిన రెండు రోజుల 24వ జాతీయ సాస్ విజయవంతంగా ముగిసింది. 2022 ఫిబ్రవరి 7,8  తేదీల్లో సదస్సు జరిగింది.  ‘ మహమ్మారి తర్వాత నెలకొన్న పరిస్థితిలో డిజిటల్ పరిపాలన :భారతదేశంలో పరిస్థితి’ అనే అంశంపై సదస్సును నిర్వహించారు. ఈ రోజు జరిగిన సదస్సు ముగింపు సమావేశంలో ‘హైదరాబాద్ డిక్లరేషన్’ ను ఆమోదించారు.

రెండు రోజుల విస్తృత చర్చల తరువాత సదస్సు ;హైదరాబాద్ డిక్లరేషన్’ ను ఏకగ్రీవంగా ఆమోదించింది. సదస్సు ఆమోదించిన ‘హైదరాబాద్ డిక్లరేషన్’ ను అనుబంధం -I లో చూడవచ్చు. సదస్సును కేంద్ర శాస్త్ర సాంకేతిక (సహాయ), భూగర్భశాస్త్రం, సిబ్బంది వ్యవహారాలు, పెన్షన్లు, అణు శాస్త్రం, అంతరిక్ష మంత్రిత్వ ( స్వతంత్ర) శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించారు. ప్రారంభ సమావేశం తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, పట్టణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి కె.టి. రామారావు అధ్యక్షతన జరిగింది. 

ఈ-పరిపాలనను మరింత సమర్థంగా  అమలు చేయాల్సిన ఆధునిక తాజా సాంకేతిక అంశాలను సమగ్రంగా ఈ-పరిపాలనపై జరిగిన 24 వ జాతీయ సదస్సులో నిపుణులు చర్చించారు. సదస్సులో ప్రసంగించిన నిపుణులు సదస్సు ఇతివృతంపై తమ అనుభవాలను, అభిప్రాయాలను వివరంగా వెల్లడించడం జరిగింది.ఈ-పరిపాలనను అమలు చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, విధానాలపై సదస్సులో పాల్గొన్న వివిధ రాష్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన అధికారులు స్పష్టమైన అవగాహన పొందారు.  రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వీటిని అమలు చేసేందుకు అవకాశం కలుగుతుంది. 

రెండు రోజుల పాటు జరిగిన సదస్సులో ఆరు అంశాలపై విడివిడిగా చర్చలు జరిగాయి, ఆత్మ నిర్భర్ భారత్, ప్రభుత్వ సేవలను ప్రజలందరికి అందుబాటులోకి తేవడం, సుపరిపాలకు సాంకేతికతను జోడించి ప్రజల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరచడం, ప్రభుత్వ విధానాల్లో ప్రజలకు భాగస్వామ్యం కల్పించడం, భారత దేశ టెకాడే- డిజిటల్ ఆర్థిక వ్యవస్థ (డిజిటల్ చెల్లింపులు-ప్రజల విశ్వాసం)పై నిపుణులు చర్చలు జరిపారు. దీనికి సమాంతరంగా జరిగిన సమావేశాల్లో జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ఈ-పరిపాలన అంశంలో అవార్డులు సాధించిన వ్యక్తులు తమ అనుభవాలు, అవార్డు సాధించిన తమ పనులను వివరించారు. 

యునికార్న్స్ 2021, ఆవిష్కరణల శక్తి, డిజిటల్ వ్యవస్థలో  జిల్లా స్థాయి ప్రతిభ, సులభతర పరిపాలన, వినూత్న పర్యావరణ వ్యవస్థ, భౌతిక ప్రమేయం లేకుండా సాంకేతికత సహకారంతో సేవలను అందించడం,ఈ పరిపాలన ఉత్తమ విధానాలపై చర్చలు జరిగాయి. ఈ-పరిపాలనలో భారతదేశం సాధించిన విజయాలు, ప్రగతిపై ప్రత్యేక ప్రదర్శనను సదస్సు సందర్భంగా ఏర్పాటు చేశారు. వివిధ అంశాలపై 50 మందికి పైగా నిపుణులు పత్రాలను సమర్పించారు. సదస్సుకు 2000 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. 

ఈ-పరిపాలన సాగుతున్న తీరుకు గుర్తింపుగా ప్రారంభ సమావేశంలో జాతీయ ఇ-గవర్నెన్స్ అవార్డు 2021నలను  అందించారు. కేంద్ర మంత్రిత్వ శాఖలు/శాఖలు, రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంత  ప్రభుత్వాలు, జిల్లాలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు మరియు విద్య, పరిశోధనా సంస్థలకు  6 కేటగిరీల కింద 26 అవార్డులు అందించబడ్డాయి. ఇందులో 12 స్వర్ణాలు, 13 రజతాలు మరియు 1 జ్యూరీ అవార్డులు ఉన్నాయి. ఆరు విభాగాలలో అవార్డు గెలుచుకున్న ప్రాజెక్ట్‌లు మరియు విజేతల పూర్తి జాబితా అనుబంధం-IIలో పొందుపరచబడింది. 

 సీనియర్ ప్రభుత్వ అధికారులు, పరిశ్రమల ప్రముఖులు మరియు పరిశోధకులు సహా ప్రతినిధులకు ఉత్తమ విధానాలు , తాజా సాంకేతిక పరిణామాలు పంచుకోవడానికి సదస్సు ఒక  వేదికను అందించింది. సమర్థవంతమైన పాలన, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సదస్సు స్ఫూర్తి కలిగించింది. ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు అమలు చేయాల్సిన ఈ-పరిపాలన సాధనాలను పంచుకోవడం, ప్రధాన మంత్రినరేంద్ర మోదీ ప్రాధాన్యత ఇస్తున్న  ‘కనీస ప్రభుత్వం, గరిష్ట పాలన’ సాధన అంశాలకు సదస్సు ప్రాధాన్యత ఇచ్చి దీనికి అవసరమైన వ్యూహ రచనపై దృష్టి సారించి సాగింది. 

error: Content is protected !!