365తెలుగు డాట్ కామ్ ఆన్ న్యూస్, హైదరాబాద్,నవంబర్ 3,2022: ఇరవై ఏళ్ళ క్రితం కుర్రకారును ఉర్రుతలూగించింది.. ఆ సినిమా.. ఆరోజుల్లోనేకాదు ఇప్పుడు కూడా ఆ సినిమా ఒక సంచలనమే. సినిమానే కాదు.. అందులో పాటలు సైతం ఒక ట్రెండ్ సెట్ చేశాయి. సినిమాల్లో తమదైన స్టయిల్లో సినిమాలు తీసి ఇండస్ట్రీలో, ప్రేక్షకుల్లో సుస్ధిర స్థానం సంపాదించుకునే డైరక్టర్లు కొందరు ఉంటార.
వారి నుంచి వచ్చే ఏ సినిమాపై అయినా ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొంటాయి. కొత్త సినిమా అనౌన్స్ అవగానే వారి పేరు మీదే బిజినెస్ కూడా జరుగుతూ ఉంటుంది. టాలీవుడ్ లో అటువంటి సెపరేట్ ట్రాక్ వేసుకున్న దర్శకుడు కృష్ణవంశీ. కథ, స్క్రీన్ ప్లే, టేకింగ్, దర్శకత్వం లో తనకంటూ ఓ స్టయిల్ క్రియేట్ చేసుకున్నాడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా ‘గులాబీ’. ఈ సినిమా విడుదలై 27 ఏళ్లు పూర్తయ్యాయి.
జేడీ చక్రవర్తి, మహేశ్వరి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా 1995 నవంబర్ 3న విడుదలైంది. యాక్షన్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. కృష్ణవంశీ దర్శకత్వ ప్రతిభ ఈ సినిమా సక్సెస్ లో కీలకంగా నిలిచింది. ఫ్రెండ్స్, ప్రేమ నేపథ్యంలో సినిమా అంతా సరదాగా ఉంటుంది. స్నేహం ముసుగులో స్నేహితుడి లవర్ ను మోసం చేయడం.. హీరో హీరోయిన్ ను కాపాడుకోవడం ప్రేక్షకులకు కొత్తగా అనిపించింది.
కాలేజీ యువతకు కూడా సినిమా బాగా కనెక్ట్ అయింది. ఈ సినిమాతో జేడీ చక్రవర్తి, మహేశ్వరి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ గా పేరు తెచ్చుకున్నారు. జీవా విలనిజం కూడా సినిమాకు ప్లస్ అయింది. శశి ప్రీతమ్ అందించిన సంగీతం సినిమాకు ప్లస్ అయింది. క్లాస్ రూమ్, మేఘాలలో తేలిపొమ్మన్నది, ఈవేళలో నీవు.. పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి.
వర్మ కార్పొరేషన్ నిర్మాణ సారధ్యంలో అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ సహ నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కింది. తొలి సినిమాను కృష్ణవంశీ తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత ఇండస్ట్రీలో ప్రామిసింగ్ డైరక్టర్ గా కృష్ణవంశీ స్థిరపడిపోయాడు.