365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమల,మే 13,2024 : తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి అపర భక్తురాలు, భక్తకవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 294వ జయంతి ఉత్సవాలు మే 22వ తేదీన తిరుమలలో వైభవంగా జరుగనున్నాయి.
వెంగమాంబ స్వస్థలమైన తరిగొండ, తిరుమల, తిరుపతి దివ్యక్షేత్రాలలో జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు.
మే 22వ తేదీన సాయంత్రం 4.30 గంటలకు తిరుమలలోని వెంగమాంబ బృందావనంలో పుష్పాంజలి సమర్పిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు తిరుమలలోని నారాయణగిరి ఉద్యానంలోని శ్రీ పద్మావతి వేంకటేశ్వర పరిణయోత్సవ మండపానికి ఉభయనాంచారీ సమేతంగా శ్రీవారు పురవీధుల గుండా వేంచేపు చేస్తారు.
సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు తరిగొండ వెంగమాంబ సంకీర్తనల గోష్ఠిగానం నిర్వహిస్తారు. రాత్రి 7 గంటలకు విశాఖ శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానంద స్వామిజీ అనుగ్రహభాషణం చేయనున్నారు.
Also read : ANNIVERSARY OF MATRUSRI TARIGONDA VENGAMAMBA’S 294TH BIRTH
ఇది కూడా చదవండి: హిమాయత్ నగర్ లో అడ్వాన్స్ డ్ వెల్ నెస్ సెంటర్ ను ప్రారంభించిన వీఎల్ సీసీ
Also read : VLCC Unveils Advanced Wellness Centre in Himayat Nagar
ఇది కూడా చదవండి: కొడంగల్ లో ఓటు వేసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
ఇది కూడా చదవండి: ఆంధ్రప్రదేశ్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న పవన్ కళ్యాణ్, ఎన్.బాలకృష్ణ..
ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో ఓటు వేసిన మాజీ వీపీ వెంకయ్య నాయుడు, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి.