Wed. Dec 25th, 2024
Oneplus_pad_365

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఏప్రిల్ 21,2023: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ తన మొదటి టాబ్లెట్ వన్‌ప్లస్ ప్యాడ్‌ను క్లౌడ్ 11 ఈవెంట్‌లో విడుదల చేసింది. అయితే, ట్యాబ్ ధరలను కంపెనీ అప్పుడు ప్రకటించలేదు. కంపెనీ ఇంకా భారతదేశంలో విక్రయించడం ప్రారంభించలేదు.

ఇప్పుడు వన్‌ప్లస్ ప్యాడ్, టాబ్లెట్ ధరలు రెండు వేర్వేరు ఫ్లిప్‌కార్ట్ జాబితాలలో గుర్తించగా.. అధికారిక OnePlus వెబ్‌సైట్ ప్రకారం, OnePlus ప్యాడ్ ఈ నెలలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. అయితే అందుకు సంబంధించిన ఖచ్చితమైన తేదీ తెలియాల్సి ఉంది. OnePlus ప్యాడ్ రెండు స్టోరేజ్ ఆప్షన్‌లలో వస్తుంది, 8GB RAM 128GB స్టోరేజ్ అండ్ 12GB RAM అండ్ 256GB స్టోరేజ్.

OnePlus ప్యాడ్ ధర..

Oneplus_pad_365

అయితే, OnePlus ప్యాడ్ ప్రత్యక్ష పేజీ Flipkart నుంచి తీసివేశారు. అయినప్పటికీ అవి కాష్డ్ వ్యూలో వీక్షించడానికి ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. మొదటి జాబితా ప్రకారం, OnePlus ప్యాడ్ బేస్ వేరియంట్ కోసం రూ. 37,999 ,టాప్ 256GB మోడల్ కోసం రూ. 39,999. ఇది ప్రత్యర్థి Xiaomi Pad 5 అండ్ Samsung Galaxy Tab A8 సిరీస్‌లతో పోలిస్తే OnePlus నుంచి మొదటి టాబ్లెట్‌ను చాలా ఖరీదైనదిగా చేస్తుంది.

ఫ్లిప్‌కార్ట్ జాబితా ప్రారంభ కస్టమర్‌లకు ప్లాట్‌ఫారమ్ అందించే కొన్ని డీల్స్ అండ్ డిస్కౌంట్‌లను కూడా వెల్లదించింది. OnePlus ప్యాడ్ SBI క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై 10 శాతం తగ్గింపుతో , Flipkart Axis బ్యాంక్ కార్డ్‌లపై 5 శాతం క్యాష్‌బ్యాక్‌తో లభిస్తుంది.

వన్‌ప్లస్ ప్యాడ్ అమెజాన్‌లో లభిస్తుందో లేదో అస్పష్టంగా ఉంది. విక్రయాలు ప్రారంభమైన తర్వాత, వినియోగదారులు అధికారిక OnePlus ఛానెల్‌ల (ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్) నుంచి కూడా టాబ్లెట్‌ను కొనుగోలు చేయవచ్చు.

OnePlus ప్యాడ్ స్పెసిఫికేషన్..

Oneplus_pad_365

ఇది OnePlus మొదటి టాబ్లెట్ . OnePlus ప్యాడ్ 2.5D కర్వ్డ్ గ్లాస్, 144Hz రిఫ్రెష్ రేట్, 2800×2000 రిజల్యూషన్, 296 PPI అండ్ 500 నిట్స్ బ్రైట్‌నెస్‌తో 11.61-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. OnePlus ప్యాడ్ 7:5 స్క్రీన్ రేషియో అండ్ 88 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోను కలిగి ఉంది.

OnePlus Pad MediaTek Dimensity 9000 ప్రాసెసర్ అండ్ LPDDR5 RAMకి 12 GB వరకు మద్దతునిస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత UIతో ప్యాడ్ పరిచయం చేశారు. OnePlus ప్యాడ్ స్మార్ట్‌ఫోన్‌తో 5G సెల్యులార్ షేరింగ్‌ను కూడా కలిగి ఉంది. క్వాడ్-స్పీకర్ సెటప్, డాల్బీ విజన్ అండ్ డాల్బీ అట్మోస్ కూడా టాబ్లెట్‌లో మద్దతునిస్తాయి.

OnePlus Padకెమెరా సెటప్ విషయానికి వస్తే ఇది 13-మెగాపిక్సెల్ సింగిల్ రియర్ కెమెరా అండ్ వీడియో కాలింగ్ కోసం 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. OnePlus ప్యాడ్ 9,510mAh బ్యాటరీ అండ్ 67W SuperWook ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతునిస్తుంది. ట్యాబ్‌తో సరిపోలే మాగ్నెటిక్ కీబోర్డ్ అండ్ స్టైలస్‌ను ఇందులో ఉన్నాయి.

error: Content is protected !!