Sun. Dec 15th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జూన్ 27,2023: న్యూఢిల్లీ వినడానికి విడ్డురంగా ఉన్నా.. ఇది మాత్రం నిజం.. 36 సంవత్సరాల వయసున్న ఓ వ్యక్తి గర్భం దాల్చి కవలలకు జన్మనిచ్చాడు. దీంతో డాక్టర్లు షాక్ కు గురయ్యారు. అంతేకాదు ఈ ఘటన వైద్య రంగానికే సవాలు విసురుతోంది.

36 ఏళ్ల వ్యక్తి కవలలకు జన్మనిచ్చాడంటే ప్రతి ఒక్కరూ ఆశ్చర్య పోతున్నారు. ఇలాంటి సంఘటనలు మనస్సును గందరగోళానికి గురిచేస్తాయి. దీనికి సైన్స్ వద్ద కూడా సమాధానం లేదు. మహిళలకు పిల్లలకు జన్మనిచ్చే హక్కు ఉంది.

36 ఏళ్ల పురుషుడు కవలలకు జన్మనిచ్చిన ఘటన మరెక్కడో కాదు, మనదేశంలోనే చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ కు చెందిన ఒక వ్యక్తి కవలలకు జన్మనిచ్చాడు. నిజానికి, ఇక్కడ నివసిస్తున్న సంజు భగత్ అనే వ్యక్తి గత 36 సంవత్సరాలుగా కడుపు సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు.

ఇతను దానిని తప్పుగా భావించి జీవితాన్ని గడిపాడు. కానీ అతని పొట్టను వింతగా చూసేవారు. కానీ ఆ వ్యక్తికి కడుపులో బిడ్డ ఉందని ఎవరూ నిర్ధారించలేదు.

కడుపు ఉబ్బిన కారణంగా అతను ఆందోళన చెందేవాడు. అకస్మాత్తుగా ఒకరోజు కడుపు మరింత ఉబ్బిపోయింది. ఆ వ్యక్తికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలైంది. దీంతో అతను డాక్టర్ వద్దకు వెళ్ళాడు. డాక్టర్ కూడా ట్యూమర్‌గా భావించి ఆపరేషన్ చేశారు. అయితే ఆపరేషన్ తర్వాత డాక్టర్ చూసిన దృశ్యం ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ కణితి బదులు వేరే ఏదో ఉంది.

ఆపరేషన్ సమయంలో వైద్యులు ఆ వ్యక్తి కడుపులో శిశువులని పోలిన ఆకృతులను చూశారు. వైద్యులు కడుపులో చేతులు పెట్టగా, చాలా ఎముకలు, ఒక కాలు, మరొక కాలు, వెంట్రుకలు, చేతులు, దవడలు , శరీరంలోని అనేక ఇతర భాగాలు కనిపించాయి. ఈ ఘటన చూసిన డాక్టర్లు ఆశ్చర్యపోయారు.

ఈ అరుదైన దృగ్విషయాన్ని వైద్యులు వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ అంటారని వైద్యులు పేర్కొన్నారు. ఇలాంటి ఫటనలు చాలా అరుదు గా జరుగుతాయని, ఇది భూమిపై 5 మిలియన్ల మందిలో ఒకరికి సంభవిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.

error: Content is protected !!