365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ముంబై, జూన్ 4,2025: ఉత్తర భారతదేశంలో ప్రముఖ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల సంస్థ అయిన పారస్ హెల్త్‌కేర్లోకి 360 వన్ అసెట్ రూ.170.60 కోట్ల మేర పెట్టుబడి వేసింది.

ఇది 360 వన్ WAMకు చెందిన అనుబంధ సంస్థ. ఈ పెట్టుబడి ప్రాథమిక మూలధనంతో పాటు, ఓ ప్రస్తుత ఇన్వెస్టర్‌‍కు సంబంధించిన పాక్షిక నిష్క్రమణను కూడా కలిగి ఉంది.

పారస్ హెల్త్‌కేర్‌ను డాక్టర్ ధర్మీందర్ నాగర్ స్థాపించారు. ఆయనకు ఆరోగ్య రంగంలో వృద్ధి, సేవల విస్తరణలో అపార అనుభవం ఉంది.

Read This also…360 ONE Asset Invests INR 170 cr in Paras Healthcare, Reinforcing Its Commitment to Transformative Healthcare in India

Read This also…Sun Pharma Announces Phase 2 Clinical Trial Results for SCD-044 in Psoriasis and Atopic Dermatitis

ప్రస్తుతం పారస్ గ్రూప్ ఉత్తర భారతదేశంలోని టియర్ 1, టియర్ 2 నగరాల్లో ఎనిమిది ఆసుపత్రులు నడుపుతూ 2000 కంటే ఎక్కువ పడకల సామర్థ్యం కలిగి ఉంది. నాణ్యమైన వైద్యసేవలను అందుబాటులోనే ప్రజలకు అందిస్తూ, దీర్ఘకాలిక స్థిరమైన వ్యాపార మోడల్‌తో సంస్థ ఎదుగుతోంది.

ఈ సందర్భంగా 360 వన్ అసెట్ సీనియర్ ఫండ్ మేనేజర్ & ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇండస్ట్రియల్స్ విభాగం స్ట్రాటెజీ హెడ్ ఉమేష్ అగ్రవాల్ మాట్లాడుతూ—
“ఇది భారత ఆరోగ్యరంగంలో మా ఏడో పెట్టుబడి.

Read This also…Google Maps Speedometer: Avoid Traffic Fines Easily..

Read This also…18Years Dream is Fulfilled..

ఈ రంగం భవిష్యత్తులో వేగంగా అభివృద్ధి చెందుతుందని మాకు నమ్మకం ఉంది. అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్యసేవల్ని ప్రజలకు అందించడంలో పారస్ హెల్త్‌కేర్‌ తో కలిసి పని చేయడం మాకు గర్వకారణం. ఈ పెట్టుబడి మా మార్కెట్ అగ్రగామి ప్రీ-ఐపీవో వ్యూహంలో భాగంగా ఉంటుంది” అని తెలిపారు.