Thu. Nov 21st, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఏప్రిల్ 19,2024: సీజన్లు మారుతున్న వేళ, రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండటానికి ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారంపై దృష్టి పెట్టడం ముఖ్యం.

రోజువారీ భోజనంలో బాదం, సీజనల్ పండ్లు , కూరగాయలు వంటి సహజమైన ఆహారాలను జోడించడం వల్ల అనారోగ్యాలను ఎదుర్కోవడానికి శరీరానికి అవసరమైన అదనపు శక్తి లభిస్తుంది.

రోగనిరోధక శక్తిని పెంపొందించే ఐదు సహజ ఆహారాలు ఇక్కడ ఉన్నాయి. కాలానుగుణ ఫ్లూ,అనారోగ్యాన్ని దూరంగా ఉంచడంలో ఇవి సహాయపడతాయి.

బాదంపప్పులు: బాదంపప్పులు కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు-వాటిలో విటమిన్ ఇ, జింక్, ఫోలేట్ ,ఐరన్ వంటివి ఉంటాయి. రోగనిరోధక పనితీరుకు మెరుగుపరచడం లో ముఖ్యమైన పోషకాలుగా ఇవి ఉపయోగపడతాయి. పౌష్టికాహారం మెరుగ్గా తీసుకోవటం కోసం ప్రతిరోజూ కొద్దిపాటి అల్పాహారంగా తీసుకోండి లేదా వాటిని ఉదయం అల్పాహారంతో పాటుగా తీసుకోండి.

సిట్రస్ పండ్లు: నారింజ, నిమ్మ, ముసాంబి, ద్రాక్షపండు వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది తెల్ల రక్త కణాల ఉత్పత్తికి అవసరమైన పోషకం-ఇన్‌ఫెక్షన్‌లకు వ్యతిరేకంగా శరీరం, రక్షణ వ్యవస్థను ప్రోత్సహిస్తుంది. ఈ పండ్లను ఆహారంలో చేర్చుకోవడం వల్ల విటమిన్ సి పెరుగుతుంది. దీన్ని వల్ల రోగనిరోధక వ్యవస్థ పెరుగుతుంది..

వెల్లుల్లి: వెల్లుల్లికి ఔషధ వినియోగం గా సుదీర్ఘ చరిత్ర ఉంది, యాంటీ బాక్టీరియల్ లక్షణాలకు ఇది ప్రసిద్ధి చెందింది, దీనిలో సహజ సిద్ద సమ్మేళనం అల్లిసిన్‌ ఉంది. భోజనంలో వెల్లుల్లిని చేర్చుకోవడం వల్ల రుచిని జోడించడమే కాకుండా సూక్ష్మజీవులతో పోరాడటానికి కూడా సహాయపడుతుంది. రుచి,ఆరోగ్యం కోసం కూరలు, సూప్‌లు, వేపుళ్ళు, సాస్‌లలో ముక్కలుగా చేసి వెల్లుల్లిని వేసుకోవచ్చు.

ఆకు కూరలు: బచ్చలికూర, మునగ ఆకులు, ఉసిరి ఆకులు, పుదీనా ఇతర ఆకు కూరలు రోగనిరోధక పనితీరులో కీలక పాత్ర పోషించే విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఈ ఆకుకూరల్లో విటమిన్ ఎ అండ్ సి , ఫోలేట్ వంటి పోషకాలు ఉన్నాయి.

ఇవి ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కూరలు, గ్రేవీలు, పప్పులు, సలాడ్‌లకు జోడించడం ద్వారా ఆహారంలో వివిధ రకాల ఆకు కూరలను చేర్చండి. ఆహారానికి పోషకాలను జోడించడం వల్ల ఆరోగ్యం పెరుగుతుంది.

ఇది కూడా చదవండి: ప్రజలను ఓటు వేయడానికి ప్రేరేపిస్తూ వినూత్నమైన మల్టీమీడియా ప్రచారాన్ని ప్రారంభించిన బంగూర్ సిమెంట్..

Also read : IndiGo to operate all domestic flights from Terminal 3, effective April 21, 2024 in Lucknow.

Also read : Xiaomi Upgrades Its Redmi Note 13 5G Series to the Human-centric Operating System- Xiaomi HyperOS

ఇది కూడా చదవండి: గ్లోస్టర్ కోసం యాజమాన్య అనుభవ కార్యక్రమాన్ని ప్రకటించిన ఎంజిమోటార్ ఇండియా.

Also read :  MGMotor India announces ownership experience program for Gloster

Also read : NSE to launch derivatives on Nifty Next 50 Index (NIFTYNXT50) from April 24, 2024

ఇది కూడా చదవండి: XVI ట్రాంచ్ IV సిరీస్ NCDలను ప్రకటించిన ముత్తూట్ ఫిన్‌కార్ప్ లిమిటెడ్..

Also read : Muthoot FinCorp Limited announces XVI Tranche IV series of NCDs, aims to raise Rs.360 crore

error: Content is protected !!