
సెప్టెంబరు, 2021: అమెరికాకు చెందిన వినియోగదారుల భారీ ఎలక్ట్రానిక్స్ కంపెనీ వెస్టింగ్‌హౌస్ భారతదేశంలోకి అడుగు పెట్టింది మరియు తన ‘మేడ్ ఇన్ ఇండియా’ టీవీ మోడళ్లను విడుదల చేసింది. ఈ బ్రాండ్ భారతదేశంలో ఉత్పత్తులను తయారు చేసే సూపర్ ప్లాస్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ (SPPL)తో ప్రత్యేక లైసెన్సింగ్ ఒప్పందాన్ని చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం వెస్టింగ్‌హౌస్‌కు
కావలసిన ఉత్పత్తి, బ్రాండింగ్, డిజైనింగ్, ప్యాకేజింగ్, రిటెయిలింగ్ వితరణ శ్రేణిని స్థానికబ్రాండ్ల 30 ఏళ్ల అనుభవం ఉన్న తయారీదారుడు ఎస్‌పిపిఎల్ నిర్వహించనుంది. ఈ ఉత్పత్తులు వినియోగదారులకు భారతదేశంలోని అతి పెద్ద ఇ-కామర్స్ మార్కెట్‌ప్లేస్ అమెజాన్‌లో ది గ్రేట్ఇండియన్ ఫెస్టివల్ సీజన్‌లో అందుబాటులో ఉంటాయి.

భారతదేశంలో వెస్టింగ్‌హౌస్ ప్రత్యేక బ్రాండ్ లైసెన్సీ సూపర్ ప్లాస్ట్రానిక్స్ ప్రైవేట్
లిమిటెడ్ (SPPL) ఉపాధ్యక్షురాలు పల్లవి సింగ్ మాట్లాడుతూ ‘‘ అమెరికాకు చెందిన
వినియోగదారుల భారీ ఎలక్ట్రానిక్స్ కంపెనీగా గుర్తింపు దక్కించుకున్న వెస్టింగ్‌హౌస్ వంటి విశ్వసనీయమైన బ్రాండ్ చేరడంతో మాకు చాలా సంతోషంగా ఉంది. ఇతర పెద్ద బ్రాండ్ల భాగస్వామ్యం తరహాలోనే మేము ‘ఆత్మనిర్భర భారత్’కు మా వంతు సేవను అందించడాన్నికొనసాగిస్తాము. అమెజాన్‌తో మా ప్రస్తుత భాగస్వామ్యం ఈ మహమ్మారి సందర్భంలో ఈ టెలివిజన్ మోడళ్లు లక్షలాది మంది వినియోగదారులు సురక్షితంగా మరియు హైజనిక్‌గా తమ ఇళ్ల వద్దే అందుకునేందుకు ప్రముఖ పాత్రను పోషిస్తోంది. అమెజాన్‌లో ఈ అత్యంత నిరీక్షణల విడుదలతోమేము వచ్చే ఏడాది చివరికి అందుబాటు ధరల టీవీ మోడళ్లలో 3-5% మార్కెట్ వాటాను పొందే
అంచనాలను కలిగి ఉన్నాము’’ అని వివరించారు.

కొత్తగా విడుదలైన ‘డబ్ల్యూ-సిరస్’ ధరలు రూ.7,999 నుంచి ప్రారంభమవుతాయి. ఈ శ్రేణిలో 24 అంగుళాల నాన్-స్మార్ట్ ఎల్ఇడి టి.వి. 4 స్మార్ట్ ఆండ్రాయిడ్ టి.వి. మోడళ్లు- 32 అంగుళాలహెచ్‌డి రెడీ, 40-అంగుళాల ఎఫ్‌హెచ్‌డి, 43 అంగుళాల ఎఫ్‌హెచ్‌డి, 5 అంగుళాల యుహెచ్‌డి ఉన్నాయి. 24- అంగుళాల నాన్-స్మార్ట్ ఎల్‌ఇడి టీవీల ధర రూ.7,999 కాగా అది 20డబ్ల్యూ స్పీకర్ఔట్‌పుట్, 2 స్పీకర్లు, ఆడియో ఈక్వలైజర్, ఆటోమేటిక్ వాల్యూమ్ లెవల్ ఆడియోఫీచర్స్‌ను కలిగి ఉంది..1366 x 768 హెచ్‌డి రెడీ డిస్‌ప్లే కలిగి ఉంది. 32-అంగుళాల హెచ్‌డి రెడీ, 40-అంగుళాల ఎఫ్‌హెచ్‌డి స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ ధరలు వరుసగా రూ.12,999 రూ.18,499గా ఉన్నాయి. రెండు పరికరాలు ఆండ్రాయిడ్ 9తో తయారుగా ఉంటూ, అత్యంత పల్చని బెజెల్‌ను కలిగి ఉన్నాయి.

24 డబ్ల్యూ స్పీకర్ఔట్‌పుట్, హెచ్‌డిఆర్, సరౌండ్ సౌండ్ సాంకేతికత, 400 నిట్స్ బ్రైట్‌నెస్, 2 స్పీకర్లు, 1జిబి ర్యామ్, 8జిబి రోమ్‌తో మృదువైన వీక్షణ అనుభవాన్ని అందిస్తుంది. ఈ బ్రాండ్ 30 డబ్ల్యూ స్పీకర్ ఔట్‌పుట్‌తో 43-అంగుళాల ఎఫ్‌హెచ్‌డి టి.వి.తో అందుబాటులోకి రాగా, అది అత్యంత పల్చని బెజెల్‌తో రూ.20,999 ధర కలిగి ఉంది. ఈ మోడల్ ఆండ్రాయిడ్ 9తోతయారుగా ఉంటూ హై-డైనమిక్ రేంజ్, 500 నిట్స్ బ్రైట్‌నెస్, సరౌండ్ సౌండ్ సాంకేతికత, 1 జిబి ర్యామ్, 8జిబి రోమ్‌ను కలిగి ఉంది. అత్యుత్తమ డిజైన్ యుహెచ్‌డి 55-అంగుళాల మోడల్ ధర రూ.32,999కాగా, అత్యంత పల్చని బెజెల్‌తో ఆండ్రాయిడ్ 9తో తయారుగా ఉంటుంది. ఈ పరికరం 40 డబ్ల్యూ స్పీకర్ ఔట్‌పుట్‌తో అందుబాటులోకి వస్తుండగా, హెచ్‌డిఆర్ 10, 2జిబి రామ్, సరౌండ్ సౌండ్ సాంకేతికత, 500నిట్స్ బ్రైట్‌నెస్, 8జిబి రోమ్ 2 స్పీకర్లను కలిగి ఉంది.
పరిమాణం మోడల్ పండుగ ధర
24 WH24PL01 7,999
32 WH32SP12 12,999
40 WH40SP50 18,499
43 WH43SP77 20,999
55 WH55UD45 32,999

ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, అన్ని స్మార్ట్ టి.వి. మోడళ్లకూ 5.0 బ్లూటూత్, 2యుఎస్‌బి పోర్టులు, 3హెచ్‌డిఎంఐ పోర్టులు, ఎఆర్ఎం కార్టెక్ట్ ఎ53 ప్రాసెసర్లు కలిగి ఉన్నాయి. అవి ఇన్-బిల్ట్ క్రోమ్‌కాస్ట్ మరియు ఎయిర్ ప్లే కలిగి ఉండగా అవి 1000+ యాప్‌లకు మద్ధతు ఇస్తాయి. 6,000కు పైగా యాప్, గేమ్స్ అందుబాటు అలాగే ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్, జీ5, సోని లివ్, గూగుల్ ప్లే స్టోర్‌ను 500,000కు పైగా టీవీ షోలను అందిస్తుంది. దేశ వ్యాప్తంగా లక్షలాది మంది వినియోగదారులకు అత్యాధునిక ‘మేడ్ ఇన్ ఇండియా’ టీవీలు అమెజాన్ ద్వారా అందుబాటు ధరలో, సురక్షితమైన మరియు హైజనిక్ విధానంలో వారి ఇంటి వాకిలివద్దే పొందేందుకు అవకాశం ఉంటుంది. ఉత్పత్తులను అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ విక్రయాల్లో అందుబాటులో ఉండడం ద్వారా వినియోగదారులు రాయితీ ఆఫర్లను కూడా నిరీక్షించవచ్చు. విక్రయ సమయంలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు వినియోగదారులు అన్ని ఉత్పత్తులపై
10% రాయితీని పొందవచ్చు. ఆసక్తి ఉన్న వినియోగదారులు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ డెబిట్ అలాగేక్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే తక్షణ రాయితీ పొందుతారు. అదనంగా ఇఎంఐ లావాదేవీలకూ తక్షణ రాయితీ లభిస్తుంది.