365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,దుబాయ్, ఏప్రిల్‌ 13,2025: అన్ని సీజన్లకు అనువైన నగరం,దుబాయ్. మీరు ఎప్పుడు సందర్శించినా అద్భుతమైన అనుభవాలను అది అందిస్తుంది. అయినప్పటికీ పరిపూర్ణ వాతావరణం, నీలాకాశాలు మరియు అన్వేషించడానికి అంతులేని మార్గాలతో వసంతకాలం నిజంగా ఇక్కడ ప్రత్యేకమైనదిగా నిలుస్తుంది . మీరు విశ్రాంతి లేదా సాహసం లేదా రెండింటినీ కోరుకుంటుంటే , దుబాయ్ లోని ఈ దిగువ అవుట్ డోర్ అనుభవాలను సొంతం చేసుకోండి.

రైప్ మార్కెట్‌ – సరదా షాపింగ్‌కు బెస్ట్‌

స్థానిక కళాకారులు, రైతులు, ఆహార విక్రేతల సమాహారంగా ఏర్పాటు చేసిన రైప్ మార్కెట్‌ సందర్శకులకు సేంద్రీయ ఉత్పత్తులు, హస్తకళల వస్తువులు, గౌర్మెట్ ట్రీట్‌లను అందిస్తూ అనుభూతిని పంచుతోంది. ఇది ఖచ్చితంగా షాపింగ్‌ ప్రియులకు నచ్చే ప్రదేశం.

ఇది కూడా చదవండి..జయశంకర్ వ్యవసాయ వర్సిటీ నుంచి ఐదు ఉత్తమ మొక్కజొన్న హైబ్రిడ్ రకాలు విడుదల..

Read this also…Bajaj Allianz Life Launches ‘Superwoman Term’ – A Pioneering Insurance Plan Tailored for Women

సోల్ మియో – కైట్ బీచ్‌ వద్ద యోగా అనుభవం

జుమేరాలోని కైట్ బీచ్‌ వద్ద సోల్ మియో నిర్వహించే #యోగాసండేస్‌ లో పాల్గొని సముద్రతీరంలో యోగా చేయడం ఒక వెరైటీ అనుభవం. ఈ యోగా సెషన్లు సోల్ మియో కస్టమర్లకు ఉచితం కావడం విశేషం.

ఆక్వావెంచర్ వాటర్‌పార్క్‌ – థ్రిల్‌ కోరేవారికి

ప్రపంచంలోనే అతిపెద్ద వాటర్‌పార్క్‌గా గుర్తింపు పొందిన ఆక్వావెంచర్‌లో 105కి పైగా జలానందాలు, రైడ్స్‌ ఉన్నాయి. ‘ఒడిస్సీ ఆఫ్ టెర్రర్’, ‘లీప్ ఆఫ్ ఫెయిత్‌’ వంటి రికార్డ్ బ్రేకింగ్ స్లయిడ్‌లు ధైర్యవంతులకు సవాలుగా నిలుస్తాయి.

దుబాయ్ బటర్‌ఫ్లై గార్డెన్‌ – ప్రకృతి ప్రేమికులకు పర్వదినం

15,000కిపైగా సీతాకోకచిలుకలతో అలరించే ఈ తోటలో 50కంటే ఎక్కువ జాతులు ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద బటర్‌ఫ్లై గార్డెన్‌ ఇది. సీతాకోకచిలుకల జీవనచక్రాన్ని తెలుసుకోవాలనుకునే వారికి ఇది చక్కటి గమ్యం.

Read this also…Bank of India Withdraws 400-Day FD Scheme, Revises Interest Rates Following Repo Rate Cut

Read this also…Hyderabad Welcomes the Largest Jawa, Yezdi, and BSA Motorcycles Dealership at Kompally

అల్ జద్దాఫ్ కాక్టస్ పార్క్‌ – ఎడారి ఔనత్యం

ప్రకృతి ప్రేమికులకు పచ్చని పండుగలా మారిన ఈ కాక్టస్ పార్క్‌ దుబాయ్‌లో ఇటీవలే ప్రారంభమైంది. ఎడారి వృక్షజాల విశేషాలను దగ్గరగా అనుభవించడానికి ఇది ఉత్తమ ప్రదేశం.

రియా రెస్టారెంట్ & బీచ్ బార్‌ – తీరప్రాంతంలో రుచుల పండుగ

మధ్యధరా దేశాల వంటకాలతో ప్రేరణ పొందిన రుచికరమైన భోజనాన్ని అందించే రియా రెస్టారెంట్ & బీచ్ బార్‌.. తీరం ఒడ్డున భోజనానికి చక్కటి వాతావరణాన్ని కల్పిస్తుంది. సూర్యాస్తమయాన్ని వీక్షిస్తూ భోజనం చేస్తే.. ఆ అనుభూతి మరువలేరు.