365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఆగష్టు 24,2023: నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2023 : 69వ జాతీయ చలనచిత్ర అవార్డులు 2021కి గాను కేంద్రం ప్రకటించింది. ఈ పురస్కారాలు దక్కించుకున్నవారిలో అలియా భట్ నుంచి కంగనా రనౌత్ వరకు అనేక మంది తారలు ఉన్నారు.
స్పెషల్ జ్యూరీ అవార్డు – షేర్ షా: ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ అవార్డు-RRR (స్టంట్ కొరియోగ్రాఫర్ – కింగ్ సోలమన్), ఉత్తమ కొరియోగ్రఫీ – RRR (కొరియోగ్రాఫర్ – ప్రేమ్ రక్షిత్), ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ – RRR (స్పెషల్ ఎఫెక్ట్స్ క్రియేటర్ – వి శ్రీనివాస్ మోహన్).
జాతీయ అవార్డు ఎవరికి వచ్చిందంటే..?
జాతీయ సమగ్రతపై ఉత్తమ చిత్రంగా ఉత్తమ నర్గీస్ దత్ అవార్డు – ది కాశ్మీర్ ఫైల్స్.. ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం – RRR. ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ – రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్..
ఉత్తమ సంగీత దర్శకత్వం – పుష్ప (దేవిశ్రీ ప్రసాద్) అండ్ ఆర్ఆర్ఆర్. ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ – గంగూబాయి కతియావాడి. ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ – సర్దార్ ఉధమ్ సింగ్. ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్ – సర్దార్ ఉధమ్ సింగ్.
ఉత్తమ ఎడిటింగ్ – గంగూబాయి కతియావాడి, ఉత్తమ సినిమాటోగ్రఫీ – సర్దార్ ఉధమ్ సింగ్, ఉత్తమ సహాయ నటి – పల్లవి జోషి (ది కాశ్మీర్ ఫైల్స్),ఉత్తమ సహాయ నటుడు – పంకజ్ త్రిపాఠి (మిమి),
ఉత్తమ చిలీస్ ఆర్టిస్ట్ – భవిన్ రాబారి, ఉత్తమ నటి – అలియా భట్ (గంగూబాయి కతియావాడి), కృతి సనన్ (మిమి), ఉత్తమ నటుడు – అల్లు అర్జున్ (పుష్ప ది రైజ్), ఉత్తమ దర్శకుడు – నిఖిల్ మహాజన్ (గోదావరి – ది హోలీ వాటర్).
ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ – రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్. ఆర్ మాధవన్ చిత్రం రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డును గెలుచుకుంది. ఉత్తమ నటుడు-అల్లు అర్జున్.. పుష్ప ది రైజ్ చిత్రానికి గాను అల్లు అర్జున్‌కు ఉత్తమ నటుడు అవార్డు లభించింది.
ఉత్తమ నటి అవార్డు..
అలియా భట్ – గంగూబాయి కతియావాడి, కృతి సనన్- మిమి, ఉధమ్ సింగ్ ఉత్తమ హిందీ చిత్రం అవార్డును గెలుచుకుంది. సదర్ ఉధమ్ సింగ్ ఉత్తమ హిందీ ఫీచర్ ఫిల్మ్ అవార్డును గెలుచుకున్నారు. ఈ చిత్రానికి షూజిత్ సిర్కార్ దర్శకత్వం వహించారు.
జాతీయ చలనచిత్ర అవార్డుల జ్యూరీ సభ్యులు ఫీచర్, నాన్-ఫీచర్, ఉత్తమ స్క్రిప్ట్ విభాగాలకు అవార్డు విజేతల జాబితాను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు అందజేశారు.