365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 28,2024: 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు డిసెంబర్ 28, శనివారం విజయవాడలోని కేబిఎన్ కళాశాల ఆవరణలో అమర జీవి శ్రీపొట్టి శ్రీరాములు ప్రాంగణంలో ఘనంగా ప్రారంభమయ్యాయి.

ఈనాడు వ్యవస్థాపకులు కీ||శే|| చెరుకూరి రామోజీరావు సభ వేదిక నుంచి సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణ ఆరవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ మండలి బుద్ధ ప్రసాద్, ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, మార్గదర్శి మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి శైలజ కిరణ్, విజయవాడ శాసన సభ్యులు డాక్టర్ ఎన్. తులసీ రెడ్డి, ప్రముఖ వాగ్వేయ కారుడు గోరంటి వెంకన్న, సినీ గేయకవి భువన చంద్ర, ప్రముఖ సైంటిస్ట్ సతీష్ రెడ్డి, జస్టిస్ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వివిధ రచయితలు రచించిన గ్రంథాలను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి కూడా పాల్గొన్నారు.