365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, చెన్నై, అక్టోబర్ 5, 2025: దక్షిణ భారత సినీ పరిశ్రమలోని ప్రముఖ నటీనటుల మద్య స్నేహ బంధానికి ప్రతీకగా నిలిచిన ‘80s స్టార్స్ రీయూనియన్’ ఈ సంవత్సరం మళ్లీ ఘనంగా జరిగింది.

మూడు సంవత్సరాల విరామం తర్వాత చెన్నైలో ఈ ప్రత్యేక సమావేశం జరగగా, 1980ల తరం స్టార్‌లు తమ స్నేహం, అనుబంధాన్ని మరోసారి గుర్తుచేసుకున్నారు.

ఈ రీయూనియన్‌లో టాలీవుడ్, కొలీవుడ్, మాలీవుడ్, సాండల్‌వుడ్ పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సినిమాల ద్వారా మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఏర్పడిన బంధాలను మరింత బలపరిచే వేదికగా ఈ వేడుక నిలిచింది.

‘80s స్టార్స్ రీయూనియన్’ గతంలోనూ దక్షిణ భారత సినీ ప్రపంచంలో ఒక అందమైన సాంప్రదాయంగా కొనసాగింది. ఈ సారి కూడా పాత స్మృతులను తలపించే ఫోటోలు, నవ్వులు, స్నేహపూర్వక సంభాషణలతో సందడి చేశారు.