365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మార్చి 1,2025: 90వ దశకంలో తన గ్లామర్, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, మునుపెన్నడూ లేని డాన్స్ మూమెంట్స్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన రంభ మరోసారి వెండితెరపై కనిపించేందుకు సిద్ధమవుతున్నారు.
తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ అందాల తార, కొన్ని సంవత్సరాలుగా సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నారు.
Read this also…90s Icon Rambha Set for a Spectacular Silver Screen Comeback
ఇది కూడా చదవండి…మార్చి 1న ZEE5, ZEE తెలుగులో ప్రీమియర్ అవుతున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’
Read this also…“Sankranthiki Vasthunnam” Grand Dual Premiere on ZEE5 & Zee Telugu – March 1st!
తాజాగా, రంభ తన రీ ఎంట్రీపై స్పందిస్తూ – “సినిమా ఎప్పుడూ నా మొదటి ప్రేమ. ఇప్పుడు నాకు నిజమైన ఛాలెంజ్ ఇచ్చే పాత్రలను పోషించడానికి సిద్ధంగా ఉన్నాను. కొత్త కోణాలను అన్వేషిస్తూ, ప్రేక్షకులతో మరింత బలమైన అనుబంధం ఏర్పరిచే అవకాశాలను ఎదురుచూస్తున్నాను” అని అన్నారు.

రంభ తన హావభావాలు, అదిరిపోయే డాన్స్ మూమెంట్స్, సహజమైన నటనతో అప్పట్లో ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు రీ ఎంట్రీతో మళ్లీ అదే మాయాజాలాన్ని సృష్టించబోతున్నారా? ఆమె ఏ సినిమాతో, ఏ పాత్రతో వెండితెరపై మెరవబోతున్నారు? అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.
ఇది కూడా చదవండి…హైడ్రా కమిషనర్ చెరువుల సందర్శన – పునరుద్ధరణ పనులపై సమీక్ష
Read this also…Strand Life Sciences Unveils StrandOmics for Rare Disease Diagnosis
Read this also…Reliance Foundation Announces Postgraduate Scholarships 2024-25 Results on National Science Day
ఆడియెన్స్ ఆమె రీ ఎంట్రీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, సినిమా ఇండస్ట్రీలోనూ ఈ బ్యూటీ రీఎంట్రీపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి రంభ రీ ఎంట్రీ ఏ స్థాయిలో హిట్ అవుతుందో చూడాలి..