Thu. Nov 21st, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, జూలై 30, 2023:”అసఫ్ జాహీ రాజవంశం 9వ నిజాం రౌనక్ యార్ ఖాన్ ఆదివారం హైదరాబాద్‌లోని నాంపల్లిలో గల దర్గాలో “ఉర్స్- ఇ- షరీఫ్ ఆఫ్ బగ్దాదీ సాహెబాన్”ని సందర్శించారు. ఇది అతని మొదటి మతపరమైన పర్యటన, హజ్రత్ పీర్ సయ్యద్ అబ్దుర్ రెహమాన్ బడే బాగ్దాదీ వర్ధంతి సందర్భంగా 101వ “ఉర్స్- ఇ- షరీఫ్ ఆఫ్ బాగ్దాదీ సాహెబాన్” సందర్శించడం జరిగింది.

ఆరోజుల్లో… అసఫ్ జా VI, హైనెస్ మీర్ మహబూబ్ అలీ ఖాన్ హజ్రత్‌కు స్వాగతం పలికారు. ఆయన రాక కోసం పరిచిన కార్పెట్ ను వెంటనే తీసుకెళ్లి, గౌరవప్రదంగా దానిని భద్రంగా దాచి ఉంచేవారట. ఆలా చేయడం ద్వారా ఆయన గౌరవానికి ఆటంకం కలుగకుండా చూసుకొనే వారట.

అత్యంత ప్రజాదరణ పొందిన జనాబ్ సయ్యద్ మహమూద్ హుసేనీ ఖాద్రీ అల్ రఫాయ్, మనవడు ప్రస్తుత 101వ ఉర్స్ ఈవెంట్ నిర్వాహకుడు సాదత్ పీర్ బగ్దాదీ ఈ సందర్బంగా మాట్లాడుతూ, గౌరవ మీర్ మహబూబ్ అలీ ఖాన్ రక్త సంబంధికుడు, వారసుడు మునిమనవడు అసఫ్ జాహీ వంశానికి చెందిన 9వ నిజాం సందర్శనకు రావడం పట్ల తాను సంతోషిస్తున్నానని గౌరవంగా భావిస్తున్నాను అని అన్నారు.

అసఫ్ జా కుటుంబానికి చెందిన 9వ నిజాం రౌనక్ యార్ ఖాన్ మాట్లాడుతూ, తన ముత్తాత, 6వ నిజాం సంప్రదాయానికి కొనసాగింపుగా పీర్ బగ్దాదీకి ప్రతిఫలంగా నాకు ఆహ్వానం లభించడం గౌరవం, ఆనందంగా ఉంది, ఇది బంధాలు బలపడడానికి మరింత తోడ్పడుతుంది. నేను ఇక్కడకు రావడం ఇదే తొలిసారి, చాలా ఆనంగా ఉంది”అని అన్నారు.

బడే పీర్ బగ్దాదీ తొమ్మిదేళ్ల వయసులో ఖురాన్ కంఠస్థం చేశాడు. ఆ తర్వాత వేదాంతశాస్త్రం, ఇస్లామిక్ న్యాయశాస్త్రంలో ప్రావీణ్యం సంపాదించాడు. 17 సంవత్సరాల వయస్సులో అతను ఉన్నత విద్యకు ప్రతీకగా ఉండే తలపాగాను సంపాదించాడు. అతను ప్రవక్త సంతానం కావడం కంటే, అతని సన్యాసం , దైవభక్తి విస్తృతమైన గుర్తింపు పొందాడు.

హజ్రత్ బడే బాగ్దాదీ తన 63వ ఏట1344 హిజిరా 10వ ముహర్రం నాడు ఈ మర్త్యలోకాన్ని విడిచిపెట్టాడు. ఆయనను హైదరాబాద్‌లోని నాంపల్లీలోని ‘ఖితా సాలిహీన్’లో ఖననం చేశారు. అక్కడ, ప్రతి సంవత్సరం అతని “ఉర్స్” (వార్షిక వర్ధంతి) ఇన్షాల్లాహ్ 10 నుంచి 12 రోజుల వరకు ముహర్రం వరకు నిర్వహిస్తారు.

error: Content is protected !!