365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జనవరి11,బెంగళూరు: అమేజాన్ ఇండియా వారి ఎంతగానో వేచి చూసిన ‘ గ్రేట్ ఇండియన్ సేల్’ 2020 జనవరి 19 నుండి 22 వరకు భారీ ఆదాలతో మళ్లీ వచ్చింది. ప్రైమ్ సభ్యులు 2020, జనవరి 18 మధ్యాహ్నం నుంచి ఆరంభమయ్యే సేల్ కు 12 గంటలు ముందుగా ప్రత్యేకమైన ప్రవేశాన్ని పొందుతారు. స్మార్ట్ ఫోన్స్, కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ & బ్యూటీ, హోం& కిచెన్, పెద్ద ఉపకరణాలు, టీవీలు, నిత్యావసరాలు , ఇంకా ఎన్నో వాటిపై విక్రేతలు డీల్స్ అందిస్తున్నారు. కస్టమర్లు అమేజాన్.ఇన్ పై వందలాది తరగతుల్లో 20 కోట్లకు పైగా ఉత్పత్తుల నుండి షాపింగ్ చేయవచ్చు.గ్రేట్ ఇండియన్ సేల్ సమయంలో కస్టమర్లు ఎస్ బీఐ క్రెడిట్ కార్డ్స్ తో అదనంగా 10% తక్షణ డిస్కౌంట్ , ఈఎంఐలు పొందడం ద్వారా మరింత ఆదా చేసుకోవచ్చు. బజాజ్ ఫిన్ సర్వ్ ఈఎంఐ కార్డ్, అమేజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ ,ఎంపిక చేయబడిన డెబిట్ & క్రెడిట్ కార్డ్స్ ను ఉపయోగించి నో-కాస్ట్ ఈఎంఐ తో కస్టమర్లు 12 కోట్లకు పైగా ఉత్పత్తుల్ని షాపింగ్ చేయవచ్చు.
స్మార్ట్ ఫోన్స్, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ & బ్యూటీ, హోం & కిచెన్, పెద్ద ఉపకరణాలు, టీవీలు, నిత్యావసరాలు , ఇంకా ఎన్నో 2020 జనవరి 19 నుండి 22 వరకు.
· 2020 జనవరి 18న మధ్యాహ్నం 12 గంటల నుండి ఆరంభమయ్యే గ్రేట్ ఇండియన్ సేల్ కు ప్రైమ్ సభ్యులు 12 గంటలు ముందుగా ప్రవేశాన్ని పొందగలరు.
· మరిన్ని ఆదాలు- ఎస్ బీఐ క్రెడిట్ కార్డ్స్ తో 10% తక్షణ డిస్కౌంట్ , ఈఎంఐ; డెబిట్ & క్రెడిట్ కార్డ్స్ పై నో -కాస్ట్ ఈఎంఐ, అమేజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ , బజాజ్ ఫిన్ సర్వ్ ఈఎంఐ కార్డ్; స్మార్ట్ ఫోన్స్, టీవీలు, ఏసీలు మరియు ఇంకా ఎన్నో వేలాది ఉత్పత్తుల పై ప్రత్యేకమైన ఎక్స్ ఛేంజ్ ప్రయోజనాలు.
· చిన్న విక్రేతలు, కళాకారులు , నేత పని వారి నుండి గొప్ప ధరలకు ప్రత్యేకమైన హస్తకళాకృతుల ఉత్పత్తులు.
· కొత్త కస్టమర్ల కోసం మొదటి అర్హమైన ఆర్డర్ పై ఉచిత డెలివరీ.
వన్ ప్లస్, శామ్ సంగ్, గ్జియోమి, యాపిల్, వీవో, అప్పో, నోకియా, హోనార్, హ్యువై వంటి మొబైల్ బ్రాండ్స్; యూసీబీ, లెవీస్, అలెన్ సోల్లీ , బాటా, హుష్ పప్పీస్, నోకియా, వీరో మోడా, ఓన్లీ, ఫ్లైయింగ్ మెషిన్, బిబా, ఔరరేలియా, డబ్ల్యూ, లవీ, కప్రీస్, వ్యాన్ హ్యుసేన్ వంటి ఫ్యాషన్ బ్రాండ్స్ , హెచ్ పీ, జేబీఎల్, బోస్, సోనీ వంటి ఎలక్ట్రానిక్స్ బ్రాండ్స్ ఎల్జీ, బీపీఎల్, టీసీఎల్, బాష్, వరల్ పూల్, వోల్టాస్ వంటి గృహోపకరణాలు, హోం సెంటర్, కెంట్, బాంబే డైయింగ్, బజాజ్, డైసన్, విప్రో, యోనెక్స్, ప్రెస్టీజ్, మిల్టన్ వారి స్పాట్ జీరో, రాయల్ ఎన్ ఫీల్డ్, గుడ్ నైట్, బాష్, హీరో సైకిల్స్, ఇన్ స్టెంట్ పాట్ వంటి హోం, కిచెన్ , స్పోర్ట్స్ బ్రాండ్స్; ఆశీర్వాద్, ఫార్ట్యూన్, టాటా, క్యాడ్ బరీ, లాక్మే, లోరియల్, వావ్, నివియా, మేబిలైన్, హ్యుగో బాస్, డేవిడ్ ఆఫ్, ఫారెస్ట్ ఎసన్షియల్స్, కామా ఆయుర్వేద వంటి సౌందర్య బ్రాండ్స్, డాబర్, సర్ఫ్ ఎక్సెల్, ఏరియల్, హార్పిక్, ప్యాంపర్స్ వంటి కిరాణా, నిత్యావసర బ్రాండ్స్, ఇంకా ఎన్నో గొప్ప బ్రాండ్లలో కొన్నింటి పై భారీ ఆదాల కోసం ఈ గ్రేట్ ఇండియన్ సేల్ కస్టమర్లు ఎదురుచూడవచ్చు. కస్టమర్లు ఇకో శ్రేణి, ఫైర్ టీవీ స్టిక్ , కిండిల్ ఈరీడర్స్ లలో అమేజాన్ పరికరాలపై గొప్ప డీల్స్ పొందవచ్చు. ఇటీవల ప్రారంభించిన ఇకో ఇన్ పుట్ పోర్టబుల్ స్మార్ట్ స్పీకర్స్ , ఒనిడా ఫైర్ టీవీ ఎడిషన్ స్మా ర్ట్ టీవీలపై గొప్ప డీల్స్ పొందవచ్చు.
అమేజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ కస్టమర్లకు ఉత్తమమైన భారతదేశపు ఎంపికను అందిస్తోంది, ఈ సేల్ కేవలం పెద్ద బ్రాండ్లు అన్నింటినీ ఒక చోటకు తీసుకురావడమే కాకుండా చిన్న, మధ్యస్థ వ్యాపారాల నుండి విలక్షణమైన ఉత్పత్తులు, కొత్త టెక్ ఉత్పత్తులు, భారతదేశపు అంకుర సంస్థల నుండి ఆరోగ్యకరమైన ఆహారాలు ,కళాకారులు, నేత పని వారు , భారతదేశానికి చెందిన ప్రతీ రాష్ట్రం , కేంద్ర పాలిత ప్రాంతానికి చెందిన గిరిజన కమ్యూనిటీల నుండి నేసిన ఉత్పత్తులు, చేతితో తయారు చేసిన సంప్రదాయబద్ధమైన , విలక్షణమైన హస్తకళాకృతులను కూడా విక్రయిస్తోంది. భారతదేశపు గిరిజన కమ్యూనిటీల నుంచి కళా పని, గుజరాత్ నుండి మిర్రర్ వర్క్, అస్సాం నుండి వెదురుతో చేసిన అలంకరణ, పశ్చిమ బెంగాల్ నుండి జనపనారతో చేసిన కళాకృతులు, తమిళనాడు నుండి తంజావూరు పెయింటింగ్స్, ఖాదీ, ఇక్కత్, పోచంపల్లి, ఫూల్ కారి, మధుబని ప్రింట్స్, రాజస్థాన్ నుండి నీలి రంగు కుండలు ఉత్పత్తులతో ద అమేజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ కస్టమర్లకు భారతదేశానికి చెందిన కళాకారులు, మహిళా ఔత్సాహికులు , ఎంఎస్ఎంఈలు అందించే విస్త్రతమైన ఎంపికను అందిస్తోంది. అమేజాన్ లాంచ్ ప్యాడ్, సహేలి ,కారీగర్ స్టోర్ ఫ్రంట్ పై విస్త్రతమైన ఎంపికను అందిస్తోంది. ఇది మాత్రమే కాకుండా, అంకుర సంస్థలు , కొత్తగా ఏర్పడుతున్న బ్రాండ్స్ రోజూవారి జీవితానికి కావల్సిన సృజనాత్మకమైన బహుమతి ఉత్పత్తులు, విలక్షణమైన పరికరాలు మరియు కొత్త పరిష్కారాలను అందిస్తున్నాయి. “గ్రేట్ ఇండియన్ సేల్” లో భారీ ఆదాలతో నూతన సంవత్సరాన్ని మరింత సంబరం చేసుకోండి. ఆఫర్ల కోసం www.amazon.in లాగ్ ఆన్ చేయండి.