Sun. Dec 22nd, 2024

బెంగళూరులో ఫిబ్రవరి 7,8 తేదీలలో ఫీనిక్స్ మార్కెట్ సిటీ వద్ద భారతదేశపు క్వాలిఫయర్స్ జరుగనున్నాయి

365తెలుగు డాట్ కామ్, ఆన్ లైన్ న్యూస్,ఇండియా, ఫిబ్రవరి5, 2020 : డ్యాన్స్ వరల్డ్ కప్ అనేది డ్యాన్స్ ఒలింపిక్స్ వంటిది. ఇందులో దాదాపు 56 దేశాలు, 18వేల మంది పోటీదారులు అంతర్జాతీయంగా ప్రతి సంవత్సరం పోటీపడుతుంటారు. ఈ సంవత్సరం డ్యాన్స్ వరల్డ్‌కప్ ఇండియా క్వాలిఫయర్స్, ప్రతి డ్యాన్సర్‌కూ ఇండియా నుంచి ఇటలీ వరకూ పోటీపడే అవకాశం కల్పిస్తుంది. మన దేశంలో అసాధారణంగా కనిపిస్తున్న ప్రతిభ కారణంగా, డ్యాన్సర్లకు ఖచ్చితమైన వేదికగా ఇండియా క్వాలిఫయర్ నిలువనుంది. ఈ క్వాలిఫయర్‌లో నాలుగేళ్ల చిన్నారుల మొదలు 25 సంవత్సరాల యువకుల వరకూ పాల్గొనడంతో పాటుగా తమ నృత్య కెరీర్‌ను ప్రారంభించవచ్చు. అదే సమయంలో రోమ్‌లో ఏర్పాటుచేసిన అంతర్జాతీయ వేదికపై తమ సత్తానూ చాటవచ్చు.

డ్యాన్స్ వరల్డ్ కప్ ఇండియా క్వాలిఫయర్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న డాక్టర్ టెరాన్స్ లూయిస్, ఇంటర్నేషనల్ టీచర్ మాత్రమే కాదు సుప్రసిద్ధ కొరియోగ్రాఫర్. వరల్డ్ డ్యాన్స్ రియాల్టీ షోలలో సుప్రసిద్ధమైన వ్యక్తి. న్యూఢిల్లీలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నుంచి గౌరవ డాక్టరేట్‌ను డ్యాన్స్‌లో పొందారాయన. డ్యాన్స్ వరల్డ్ కప్ న్యాయనిర్ణేతల బృందంలోని పాలో సోప్రాన్జీ, అర్జెంటీనాకు చెందిన వారు. ఇండియా క్వాలిఫయర్స్‌కు న్యాయనిర్ణేతగా వ్యవహరించడంతో పాటుగా డ్యాన్స్ వరల్డ్‌కప్ ఛైర్మన్ జాన్ గ్రిమ్షా కూడా న్యాయ నిర్ణేతగా వ్యవహరించనున్నారు. ఫ్లామెన్కోపై మాస్టర్ క్లాస్‌లను 09 ఫిబ్రవరి 2020 వ తేదీన బెంగళూరులోని స్టూడియో కుక్ టౌన్‌లో పాలో సోప్రాన్జో నిర్వహించనున్నారు. గత కొద్ది సంవత్సరాలుగా గణనీయమైన స్థాయిలో ఇండియా మెడల్స్‌ను గెలుచుకుంది. వీటిలో 3 బంగారం, 3 వెండి మరియు 4 రజత పతకాలు గత సంవత్సరం పోర్చుగల్‌లో జరిగిన డ్యాన్స్ వరల్డ్‌కప్‌లో ఉన్నాయి. ఈ సంవత్సరం మరిన్ని విజయాలను సాధించే ప్రతిభావంతుల కోసం ఇండియా వెతుకుతుంది. డ్యాన్స్ వరల్డ్ కప్ ఇండియా క్వాలిఫయర్స్‌కు డైరెక్టర్ , ప్రొడ్యూసర్ లౌర్డ్ విజయ్. గిన్నీస్ బుక్ రికార్డ్ హోల్డర్ అయిన ఆయన, జాకీచాన్, నందితా దాస్, ఫురబ్ కోహ్లీ, మల్లికా షెరావత్ లాంటి వారితో కలిసి పనిచేశారు. డ్యాన్స్ ఇండియా డ్యాన్స్, లక్స్ పర్‌ఫెక్ట్ బ్రైడ్ లాంటి రియాల్టీ షోలతోనూ ఆయన చేశారు. ఆసియా ప్రాంతంలో లాటిన్ కల్చర్, మ్యూజిక్ మరియు డ్యాన్స్ కు ముఖ్య ప్రచారకులుగా ఉన్నారు. సల్సా, బచాటా, చ-చ, ఆఫ్రో క్యుబన్ ఫంక్, ఫ్రీ స్టైల్ జివ్, ఆక్రో-డ్యుయో, లిఫ్ట్స్ అండ్ ట్రిక్స్‌లో అపార నైపుణ్యం ఉంది.
ఈ పోటీలో పాల్గొనేవాళ్ళు నమోదు చేసుకోవదానికి www.lvds.in Email: lourdvijay@lvds.in లేదా +91 98450 15123 సంప్రదించవచ్చు.

error: Content is protected !!