365తెలుగు డాట్ కామ్ ,ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, మార్చి14, 2020: కళను అభిమానించే హైదరాబాద్ నగరవాసులకు మరో మారు అద్భుతమైన చిత్రప్రదర్శనను ఏర్పాటు చేశారు ప్రముఖ చిత్రకారిణి శ్రీమతి భారతీ షా. అహ్మదాబాద్‌కు చెందిన ఈ సెల్ఫ్ మేడ్ ఆర్టిస్ట్ దాదాపు రెండు దశాబ్దాలుగా ఆమె కలలు, భావాలకు రూపం అందించింది. పద్మశ్రీ కె లక్ష్మా గౌడ్, సుప్రసిద్ధ కళాకారుడు లక్ష్మణ్ ఏలేలు ఈ చిత్ర ప్రదర్శనను కావూరీ హిల్స్‌లోని స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ప్రారంభించారు.
చిత్రకారిణి భారతీ షా మాట్లాడుతూ “గత కొద్ది సంవత్సరాలుగా నేను నా జీవితంలోమరో కోణం ఏమీ లేదని భావిస్తున్నాను. నాలోని వైవిధ్యమైన కోణాన్ని కనుగొనడం అద్భుత అనుభవం. ఇది నాతో పాటుగా చుట్టు పక్కల వారిని సైతం ఆనందాశ్చర్యాలకు గురి చేసింది. ఇది నా మెటామార్ఫోసిస్. ఈ మెటామార్ఫోసిస్‌ను కాన్వాస్‌లో చిత్రించాను..” అని భారతీ షా అన్నారు. ఈ చిత్ర ప్రదర్శన మార్చి17 తేదీ వరకూ స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌లో ప్రదర్శించనున్నారు.