Fri. Dec 27th, 2024

365 తెలుగు డాట్ కామ్ ,ఆన్ లైన్ న్యూస్, మార్చి 17, హైదరాబాద్:కురులు మహిళ కి అత్యుత్తమ సౌందర్య సఖి మాత్రమే కాదు, ఇవి ఆమె అస్తిత్వం, హావభావాలలో ఒక ప్రధాన భాగం కూడా. ఆమె ముఖకవళికలు, మనోభావాలకు ఉదాహరణగా నిలిచిన ఈ కురులు మహిళ ,అంతర్గత భావజాలాలకు ఆధారం. భారతీయ మహిళ విషయంలో ఇది అక్షర సత్యం, ఆమె విషయంలో కురులు ఆమె పరిపూర్ణ రూపాన్ని చూపించే ఒక అంతర్గత భాగం. కురుల పొడవు ఎంత మరియు ఎంచుకునే విధానం ఏమిటి అన్నది ఇక్కడ అప్రస్తుతం, మహిళ జీవితంలో ఆమె కురులు అతి మఖ్యమైన పాత్ర పోషించటం మాత్రమే కాక, వారు తమ గురించి ఎలా అనుభూతి చెందుతున్నారు అన్నదాని మీద కూడా దీని ప్రభావం ఉంటుంది. ఈ సంగతిని గుర్తించి, పేరాచ్యూట్ అడ్వాన్స్డ్ ఈ విశిష్ట వ్యక్తిత్వాన్ని సజీవంగా చూపించే, మహిళల గుర్తింపు లో ప్రధాన అంశమైన ఒక భావాత్మక ఉద్యమాన్ని ప్రవేశపెట్టింది.  

పేరాచ్యూట్ అడ్వాన్స్డ్ తో కలిసి, సుప్రసిద్ధ భారతీయ సినీ నటి ఈషా రెబ్బా తో సహా అనేక ప్రసిద్ధ సినీ తారలు సోషల్ మీడియాలో కనిపించి, తమ అందచందాలకు తమ కురులు ఎలా సహకరించి, తమ మనోబలాన్ని పెంచాయో నేడు తాము ఇలా నిలబడేలా చేసాయో తెలియజేసారు. మహిళా దినోత్సవం సందర్భంగా, ఈషా రెబ్బా ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియో పోస్ట్ చేస్తూ ఇలా అన్నారు,  నా కురులు నేనెవరని పరిపూర్ణంగా తెలియజేస్తాయి, ఒక వ్యక్తిగా నేనెవరని తెలియజేసే ప్రతిబింబమే నా కురులు అని నేను విశ్వసిస్తున్నాను ,నా వివిధ మనోభావాలను తెలియజేసేందుకు ఇవి నాకు సహకరిస్తాయి!”

ఇంస్టాగ్రామ్ లో ఈ దక్షిణాది అందాల సినీతార, పేరాచ్యూట్ అడ్వాన్స్డ్ బ్రాండ్ ఫిల్మ్ లో తన హృదయ వీణను మీటుతూ చెప్పిన బావ తరంగాల పదాలు కొన్ని ఇవి, వీటిని కురులు అనకండి, ఇవి కురులే కావు. హెయిర్ బ్యాండ్ తో ముడి వేసినవి, సంకల్పంతో ప్రోగు చేసినవి. ఈ విరబోసిన నా కురులు, ఇవి నా రెక్కలు. వీటిపై నా పేరు రాసి ఉంది. ఇవి కురులు కావు. ఇవి నేనే, నా కురులే నా ప్రాణం.పేరాచ్యూట్ అడ్వాన్స్డ్ ద్వారా ఈ ప్రచార ఉద్యమం ఆధునిక అందాల స్నప్నజగత్తుని సృష్టిస్తుంది, మహిళల మనోభావాల వ్యక్తీకరణకు మరియు మానసిక భావ భంగిమకు ఇవి మౌలిక భావోద్వేగాల వేదిక. మన దేశంలో మహిళల జీవితంలో దృఢమైన, అందమైన కురుల ప్రాముఖ్యతను ఇది నొక్కివక్కాణిస్తుంది. ఈ యాడ్ ఫిల్మ్ కళాత్మకంగా కొందరు మహిళలకు ఇది ఎలా నిజమని షోకేస్ చేసి చూపిస్తుంది; వారి కురులు వారి సుస్థిర నిశ్చయానికి ఎలా ఒక చిహ్నం అని, లేదా ఇవి చెప్పలేని ఎత్తులకు మహావేగంగా ఎగిరే ఒక విహంగం,రెక్కలు ఎలా అని, ఇవి కురులు మాత్రమే కావు, ఇవి ప్రేమ తరంగాల వీణాతంత్రులు. పేరాచ్యూట్ అడ్వాన్స్డ్ ప్రారంభం నుంచి మహిళల సఖి గా మారిన ఒక బ్రాండ్, కాబట్టి నిజంగా వారి జీవితంలో కురుల ప్రాధాన్యతను ఇది చక్కగా అర్థం చేసుకుంటుంది, కాబట్టి వాటికి చక్కని పోషణ అందించే అత్యుత్తమైనదానినే ఉపయోగించమని వారిని దృఢంగా కోరుతున్నది.  

హిందీ యాడ్ ఫిల్మ్ లింక్: https://www.youtube.com/watch?v=IfxC9He7tXw

తెలుగు యాడ్ ఫిల్మ్ లింక్: https://www.youtube.com/watch?v=soZbyC7lPTE&feature=youtu.be

error: Content is protected !!