365తెలుగు డాట్ కామ్,ఆన్లైన్ న్యూస్, 27 మార్చి ,నేషనల్ ,2020: ఏదైనా రుణం పొందిన తర్వాత దాన్ని తిరిగి చెల్లించేందుకు ఇచ్చే గడువును మారటోరియం అంటారు. ఒక విద్యార్థి విద్యారుణం తీసుకున్నట్లయితే అతడు కోర్సు పూర్తి చేసి ఉద్యోగం వచ్చిన తర్వాత రుణాలను వాయిదా రూపంలో చెల్లించడం ప్రారంభించవచ్చు. ఈ గడువే మారటోరియం. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా కరోనా వైరస్ లాక్డౌన్ పరిస్థితుల నుంచి ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వీటిలో రెపో రేటు తగ్గింపు, రుణ ఈఎంఐలపై 3 నెలల మారటోరియం వంటివి కూడా భాగమే. ఆర్బీఐ రేట్ల కోత వల్ల రుణాలపై వడ్డీ రేట్లు బాగా తగ్గే అవకాశం కూడా ఉంది. దీంతో ఇప్పుడు క్రెడిట్ కార్డు కలిగిన వారికి కొన్ని ప్రశ్నలు తలెత్తే అవకాశముంది. ఇంకా ఈఎంఐ కట్టకపోతే క్రెడిట్ స్కోర్ దెబ్బతినదా? అనే ప్రశ్నలు కూడా చాలా మందికి వచ్చే ఉంటాయి.
-ఏరుణాలకు ?
ఆర్బీఐ చాలా స్పష్టంగా తెలియజేసింది. టర్మ్ లోన్స్‌కు ఈ మారటోరియం వర్తిస్తుందని పేర్కొంది. అంటే హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, వెహికల్ లోన్స్ వంటి వాటికి ఇది వర్తిస్తుంది. కన్సూమర్ డ్యూరబుల్ లోన్స్‌కు మారటోరియం ఉంటుంది. అంటే ఫ్రిజ్, స్మార్ట్‌ఫోన్, టీవీ వంటి వాటి కొనుగోలుకు రుణం తీసుకున్న వారు కూడా ఈఎంఐ కట్టక్కర్లేదు.
-బ్యాంకులు అకౌంట్ నుంచి ఈఎంఐ వసూలు చేసుకోవా?
ఆర్బీఐ కేవలం మారటోరియం సదుపాయాన్ని మాత్రమే కల్పించాలని బ్యాంకులకు తెలియజేసింది. దీంతో బ్యాంకులు ఈఎంఐ డబ్బులను కట్ చేసుకోవాలా? లేదా? అనే అంశాన్ని కస్టమర్లకు తెలియజేయాల్సి ఉంటుంది. బ్యాంక్ నుంచి ప్రత్యేకమైన అప్రూవల్ రాకపోతే అకౌంట్ నుంచి ఈఎంఐ డబ్బులు కట్ అవుతాయి.-వ్యాపారానికి ?
ఆర్బీఐ బిజినెస్ లోన్స్‌కు సంబంధించి కూడా వివరణ ఇచ్చింది. అన్ని వర్కింగ్ క్యాపిటల్ లోన్స్‌కు వడ్డీ చెల్లింపుపై మారటోరియం ఫెసిలిటీ కల్పించింది. దీంతో బిజినెస్ లోన్ తీసుకున్న వారు వడ్డీ చెల్లింపులను 3 నెలల మారటోరియం తర్వాత కట్టేయవచ్చు.
ఆర్బీఐ నిర్ణయంతో ఇప్పుడు బ్యాంకులు ఏం చేస్తాయి?
రిజర్వు బ్యాంక్ 3 నెలల మారటోరియం ప్రకటించిన నేపథ్యంలో బ్యాంకులు ఈ అంశంపై చర్చిస్తాయి. బోర్డు స్థాయిలో ఈ అంశంపై చర్చలు జరుగుతాయి. ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత బ్యాంకులు మీకు ఏ విషయాన్ని తెలియజేస్తాయి.
-క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టాలా? లేదా?
క్రెడిట్ కార్డులకు ఇది వర్తించదు. క్రెడిట్ కార్డులు టర్మ్ లోన్స్ కిందకు రావు. అందువల్ల క్రెడిట్ కార్డు బిల్లును కచ్చితంగా చెల్లించాల్సి ఉంటుంది. లేదంటే భారీ పెనాల్టీలు చెల్లించుకోవలసి వస్తుంది.
ఎటువంటి బ్యాంకులకు చెల్లించాల్సిన పని లేదు?
ఆర్బీఐ ప్రకటన ప్రకారం.. అన్ని వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, లోక్ ఏరియా బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్, ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఎన్బీఎఫ్సీలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, మైక్రో ఫైనాన్స్ కంపెనీలకు చెందిన కస్టమర్లు ఈఎంఐలు చెల్లించాల్సిన అవసరం లేదు. వీటి నుంచి కస్టమర్లకు ఈఎంఐ గురించిన సమాచారం వస్తుంది.మినహాయింపా… వాయిదానా?
ఈఎంఐ కట్టక్కర్లేదంటే కేవలం వాయిదా వేశారని అర్థం. 3 నెలల తర్వాత మళ్లీ ఈఎంఐలు కట్టాలి.