365తెలుగు డాట్ కామ్ ఆన్లైన్ న్యూస్ ఆగష్టు 19, 2020:అమరావతి : భారతదేశంలో అతిపెద్ద ప్రైవేట్ హోమ్ బ్రాడ్‌బ్యాండ్ సంస్థ భారతీ ఎయిర్‌టెల్ (ఎయిర్‌టెల్) బుధవారం తమ అత్యున్నత వేగంతో కూడిన ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ఫైబర్ హోమ్ బ్రాడ్ బ్యాండ్ సేవలను రాజమండ్రి, కాకినాడ లలోప్రారంభించింది. వర్క్‌ఫ్రమ్ హోమ్, ఆన్‌లైన్ విద్య, ఈ–కామర్స్ , వీడియో స్ట్రీమింగ్ వంటివి దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలకు నూతన సాధారణంగా వెలుగొందుతున్న వేళ భారతదేశంలో మిగిలిన నగరాలతో పాటుగా రాజమండ్రి, కాకినాడ లలో నాణ్యమైన హోమ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలకు డిమాండ్ వృద్ధి చెందుతుంది. ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ఫైబర్ తమ అత్యాధునిక నెట్‌వర్క్‌తో, విలువ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ పథకాలను డౌన్‌లోడ్ మరియు అప్‌లోడ్ స్పీడ్స్ 300ఎంబీపీఎస్ వరకూ వై–ఫై మద్దతుతో ఇంటిలోని బహుళ అనుసంధానిత స్ర్కీన్స్, ఉపకరణముల అవసరాలకు మద్దతునందిస్తూ అందిస్తుంది. విర్ ఇందర్ నాథ్, సీఈవో– హోమ్స్, భారతీ ఎయిర్‌టెల్ మాట్లాడుతూ ‘‘ హోమ్ బ్రాడ్‌బ్యాండ్ అనేది ఇప్పుడు ప్రాధమిక అవసరం అయింది. మన రోజువారీ జీవితాలకు గేట్‌వేగా ఇంటర్నెట్ మారింది. అధికశాతం సేవలను ప్రజలు ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే ఉపయోగించుకుంటున్నారు. నిరూపించిన మా ఎయిర్ ఎక్స్‌ట్రీమ్ ఫైబర్ అనుభవాలను రాజమండ్రి, కాకినాడ లలోని వినియోగదారుల చెంతకు తీసుకురావడంతో పాటుగా వారి డిజిటల్ కోరికలను తీరుస్తుండడం పట్ల సంతోషంగా ఉన్నామని అయన అన్నారు.
ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ఫైబర్, అత్యంత సౌకర్యవంతమైన అద్దె పథకాలతో లభ్యమవుతుంది. ఈ పథకాలు కనీసం 100 ఎంబీపీఎస్ డాటా వేగంతో 799 రూపాయలు ఆరంభ ధరతో లభిస్తాయి. ఈ పథకాలలో ఎయిర్‌టెల్ థ్యాంక్స్ ప్రయోజనాలైనటువంటి 12 నెలల అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం, ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ కంటెంట్ ఉచిత చందా (10వేలకు పైగా చిత్రాలు షోస్) తో పాటుగా ఉచిత వింక్ మ్యూజిక్ చందా (45 లక్షలకు పైగా పాటలు) ఉంటాయి.