Aakash Educational Services Limited (AESL) launches first ever Aakash Student Alumni portalAakash Educational Services Limited (AESL) launches first ever Aakash Student Alumni portal

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,న్యూ ఢిల్లీ, ఆగస్టు 26, 2020: టెస్ట్ ప్రిపరేషన్ సేవలలో ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ (ఎఇఎస్ఎల్),  ఆకాశ్ క్లాస్ రూమ్ ప్రోగ్రాం పూర్వ విద్యార్థులు అందరినీ ఇనిస్టిట్యూట్, ఫ్యాకల్టీస్,బ్యాచ్ మేట్స్ తో కలుపుటకు మొట్టమొదటి ఆకాష్ స్టూడెంట్స్ ఆలమ్ని పోర్టల్ ప్రారంభింతింది.ఈ పోర్టల్ జాగ్రాఫికల్ గా కాంటాక్ట్ బిల్డ్ కమ్యూనికేషన్ లో ప్రభావవంతమైన పాయింటుగా ఉపయోగపడుతుంది. ఈ పోర్టల్ ద్వారా ఈ ఆలమ్ని ఆకాష్ ఇనిస్టిట్యూట్ గురించి అప్డేట్స్,లేటెస్ట్ సమాచారం అందుకుని, విద్యా పరిశ్రమలో జరిగే ముఖ్య ఈవెంట్స్ గురించి వారికి ఎల్లప్పుడు తెలియజేస్తూ ఉంటుంది.ఈ పోర్టల్ లో జాబ్ సెర్చ్ విండో వంటి విశిష్ట ఫీచర్లు ఉంటాయి. దీనిలో ఎఇఎస్ఎల్ టీమ్, ఇనిస్టిట్యూట్ కి సంబంధిత జాబ్ ఓపెనింగ్స్ ని షేర్ చేస్తుంది,ఇలా ఈ ఆలమ్ని సంబంధిత అవకాశాలాను ఆవిష్కరిస్తుంది. దీనిలో ఒక సెర్చ్ ఫీచర్ కూడా ఉంటుంది. ఈ ఫీచర్ ద్వారా స్టూడెంట్స్ తమకు కావలసిన లొకేషన్, డిజిగ్నేషన్ ఆధారంగా, తమ బ్యాచ్ మేట్స్ ని ఫిల్టర్ చేసి కనుగొనవచ్చు. ఇలా ఈ ఆలమ్ని ఒకరితో మరొకరు కలుసుకునేందుకు సహాయపడుతుంది.ఈ ప్లాట్ఫార్మ్ నూతన విద్యార్థులలో విశ్వాసం,నమ్మకం కలిగించేటందుకు, ఆకాష్ స్టూడెంట్స్ ద్వారా సాధించబడిన విజయ కథనాలు,గ్రేట్ మైల్ స్టోన్స్ వివరాలతో కొంత ప్రోత్సాహక సాఫల్యం గురించి కూడా తెలియజేస్తూ ఉంటుంది. ఈ పోర్టల్,   వెబినార్స్, కన్క్లేవ్స్, డిస్కషన్ ఫోరమ్స్ వంటి

Aakash Educational Services Limited (AESL) launches first ever Aakash Student Alumni portal
Aakash Educational Services Limited (AESL) launches first ever Aakash Student Alumni portal

రాబోయే ఈవెంట్స్ గురించి సమాచారం అప్ గ్రేడ్ చేస్తుంది, ఇలా స్టూడెంట్స్ తమ మిత్ర సముదాయం నుండి ఆహ్వానాలు అందుకొనటానికి ఇది ఉపయోగ పడుతుంది. ఈ పోర్టల్  ఆలమ్ని మీట్, ఆలమ్ని వెబినార్,  ఆలమ్ని అవార్డ్స్ వంటి మల్టిపుల్ క్యాపైన్స్ ఆర్గనైజ్ చేయుటకు అనేబుల్ చేయబడినది, ఇలా ఇది భవిష్యత్తులో స్టూడెంట్స్, ఫ్యాకల్టీస్,ఇనిస్టిట్యూట్స్ మధ్య నిరంతర సంబంధాన్ని స్థాపించుటకు సాధనంగా ఉపయోగపడుతుంది.ఈ పోర్టల్ ప్రారంభం గురించి మాట్లాడుతూ, శ్రీ ఆకాష్ చౌధరి, డైరెక్టర్ & సిఇఒ,  ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ (ఎఇఎస్ఎల్) ఇలా అన్నారు: “ అనేక జగ్రాఫికల్ విభాగాలలో కెరీర్ లో గొప్ప ఔన్నత్యాలు సాధించిన ఆకాష్ పూర్వ విద్యార్థులతో సంబంధాలు  ఏర్పాటు చేసుకొనుటకు ఆకాష్ స్టూడెంట్ ఆలమ్ని పోర్టల్ ఒక గ్రేట్ మీడియంగా ఉపయోగపడుతుంది. ఇది వారి సక్సెస్ స్టోరీలను షోకేస్ చేయటానికి ఉపయోగ పడుతుంది,వారి రిచ్ అనుభవాలు మా ప్రస్తుత విద్యార్థులకు అధ్యయనంలో ప్రోత్సాహం,ప్రేరణగా ఉపయోగపడుతుంది. విద్యార్థులు, ఇనిస్టిట్యూట్ ,టీచర్స్ రిలేషన్షిప్ అనేది విద్యార్తులకు మాత్రమే కాక, ఇనిస్టిట్యూట్ అభివృద్దికి కూడా ఎంతగానో సహకరించే శ్రేష్టమైన సత్సంబంధాల బాండ్ అవుతుంది. ఆకాష్ ఆలమ్ని పోర్టల్  రాబోయే సంవత్సరాలలో దృఢమై ఆకాష్ సముదాయాన్ని తప్పకుండా నిర్మిస్తుందని మేము విశ్వసిస్తున్నాము.