365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, డిసెంబర్, 11,2020 ః సింగపూర్ కేంద్రంగా కలిగిన పెట్టుబడుల నిర్వహణ కంపెనీ, సర్క్యులేట్ క్యాపిటల్ ప్రధానంగా సముద్రాలలో చేరే ప్లాస్టిక్ వ్యర్ధాలను నివారించడంతో పాటుగా వృత్తాకార ఆర్థిక వ్యవస్థ (సర్క్యులర్ ఎకనమీ)ని మెరుగుపరిచేందుకు కృషి చేస్తుంది. ఈ కంపెనీ ఏర్పాటుచేసిన సర్క్యులేట్ క్యాపిటల్ ఓషన్ ఫండ్ (సీసీఓఎఫ్) ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగా కలిగిన సాంకేతికాధారిత ప్లాస్టిక్ రీసైక్లింగ్ సంస్థ శ్రీ చక్ర పాలీప్లాస్ట్(శ్రీచక్ర)లో వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడించింది. పెప్సికో (దీని మొదటి ఇన్వెస్టర్), ప్రోక్టర్ అండ్ గాంబెల్,డౌ,డానోన్,చానెల్, యునిలీవర్, ద కోకా కోలా కంపెనీ చెవ్రాన్ ఫిలిప్స్ కెమికల్ భాగస్వామ్యంతో ఏర్పాటుచేసిన సీసీఓఎఫ్, దక్షిణ ఆగ్నేయాసియాలలోని సముద్రాలలో ప్లాసిక్ వ్యర్ధాలపై పోరాటం సాగించేందుకు ఏర్పాటుచేసిన ప్రపంచంలోనే మొట్టమొదటి ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్.స్థానికంగా సేకరించిన పెట్ ప్లాస్టిక్ వ్యర్థాలను అంటే ప్లాస్టిక్ బాటిల్స్ వంటి వాటిని సేకరించి వాటిని అత్యున్నత నాణ్యత కలిగిన పెట్ ఓలెఫిన్ ఫ్లేక్స్, గ్రాన్యుల్స్‌గా మార్చి విలువ ఆధారిత ఉపయోగాలైనటువంటి ప్యాకేజింగ్ వంటి వాటికి అందిస్తారు. వీటిని మరల మరల పునరుత్పత్తి చేయడం ద్వారా సర్కుల్యర్ ఎకనమీని మెరుగుపరుస్తారు.సమర్థత నాణ్యతపై దృష్టి కేంద్రీకరించిన శ్రీచక్ర, భారతదేశంలో ప్లాస్టిక్ రీసైక్ల్గింగ్ పరిశ్రమలో తొలిసారి అనతగ్గ ఎన్నో ఆవిష్కరణలను చేసింది. ఈ లక్షణమే కంపెనీకి గణనీయమైన పోటీ ప్రయోజనమూ అందించింది. 2010వ సంవత్సరంలోనే ఈ కంపెనీ ప్లాస్టిక్ రీసైక్లింగ్ పరిశ్రమలో ఆటోమేషన్‌ను పరిచయం చేసింది. ఇది స్థిరంగా నాణ్యత వృద్ధి చేయడంతో పాటుగా రీసైకిల్డ్ ప్లాస్టిక్ మెటీరియల్ స్వచ్ఛతకు సైతం సహాయపడి బ్రాండ్ యజమానులు వర్జిన్ ప్లాస్టిక్ వినియోగం తగ్గించేందుకు తోడ్పడుతుంది. ఈ శ్రమ ఫలితంగానే మొట్టమొదటి బాటిల్ టు బాటిల్ ప్రక్రియ ఉత్పత్తి సదుపాయాన్ని భారతదేశంలో అభివృద్ధి చేసేందుకు తోడ్పడింది.2019 ఆర్ధిక సంవత్సరంలో శ్రీచక్ర , 4వేల టన్నుల ప్లాస్టిక్‌ను రీసైకిల్ చేయడంతో పాటుగా వచ్చే సంవత్సరంలో ఈ సామర్థ్యంను ఐదు రెట్లకు వృద్ధి చేయాలని లక్ష్యంగా చేసుకుంది.
రవీంద్ర వెంకట, కో–ఫౌండర్ సీఈవో– శ్రీచక్ర పాలీప్లాస్ట్ మాట్లాడుతూ ‘‘ 2010లో, మేము భారతదేశంలో ప్లాస్లిక్ సైక్లింగ్ ప్రక్రియను లాభదాయక రీసైక్లింగ్ కంపెనీని నిర్మించగలమనే గట్టి నమ్మకంతో ప్రారంభించాము. ప్లాస్టిక్ వ్యర్థాలను పలు మార్లు రీసైకిల్ చేయడం ద్వారా వాటిని భూమి లేదా సముద్రాలలో చేరనీయకుండా అడ్డుకోగలమన్న భరోసా అందిస్తున్నాము. సర్క్యులేట్ క్యాపిటల్ మద్దతుతో మేము భారీ పరిమాణంలో రీసైకిల్డ్ మెటీరియల్‌ను అత్యున్నత ప్రమాణాలతో ఉత్పత్తి చేయడం ద్వారా మా ఆఫరింగ్‌ను మరింత వృద్ధి చేయడాన్ని లక్ష్యంగా చేసుకున్నాం. ఇది భారతదేశపు మొట్టమొదటి ఫుడ్ గ్రేడ్ అప్లికేషన్ సదుపాయంగా తీర్చిదిద్దగలదని ఆశిస్తున్నాము’’ అని అన్నారు.ఈ వాగ్ధానం గురించి రాబ్ కప్లాన్, సీఈఓ, సర్క్యులేట్ క్యాపిటల్ మాట్లాడుతూ ‘‘ వ్యర్ధాల నుంచి విలువను సృష్టించాలనే కోరికతో హైదరాబాద్‌లో పుట్టిన శ్రీచక్ర, బలీయమైన సాంకేతికత అత్యున్నత శ్రేణి ఉత్పత్తి నాణ్యత దిశగా కృషి చేయడం ద్వాకరా మొత్తం వ్యర్ధ నిర్వహణ రీసైక్లింగ్ పరిశ్రమలో అత్యాధునిక ఆవిష్కరణలను చేసింది. శ్రీచక్ర ప్రయాణానికి మరింత తోడ్పాటునందించడానికి మేము ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము’’ అని అన్నారు.ఇప్పటి వరకూ 39 మిలియన్ యూఎస్ డాలర్లను సర్క్యులేట్ క్యాపిటల్ అందించేందుకు వాగ్ధానం చేసింది. ప్లాస్టిక్ కాలుష్యంపై పోరాడేందుకు భారతదేశంలో సర్క్యులర్ ఎనకమీని మెరుగుపరిచేందుకు అంకితం చేసిన అతి పెద్ద పెట్టుబడిగా ఇది నిలుస్తుంది. ఈ పోర్ట్‌ఫోలియోలో ఆరు స్థానిక చిన్న మధ్య తరహా వ్యాపార సంస్థలు (ఎస్‌ఎంఈలు) భాగంగా ఉంటాయి. ఇవి వ్యర్ధ నిర్వహణ రంగంలో అగ్రగాములుగా ఉన్నాయి రీసైక్లింగ్ విలువ చైన్‌లో వైవిధ్యతను తీసుకువచ్చాయి. ఈ క్రమంలో, ఈ పోర్ట్‌ఫోలియో భారతదేశంలో పరిశ్రమను భౌతికంగా వృద్ధి చేయడాన్ని లక్ష్యంగా చేసుకుని కీలకమైన వ్యవస్ధీకృత ఖాళీలు, పర్యావరణ వ్యవస్ధలో ఇబ్బందికరమైన అంశాలు అయినటువంటి విఛ్చిన్నం, కనిపెట్టగల లోపాలను గుర్తించలేకపోవడం, రీసైకిల్డ్ పదార్ధాల తక్కువ నాణ్యతను మూడు కీలకమైన ఆవిష్కరణ వ్యూహాలు వ్యర్ధాలను విలువగా మార్చేందుకు అప్‌సైక్లింగ్‌ను వ్యాప్తి చేయడం (లుక్రో ప్లాస్ట్‌సైకిల్, శ్రీచక్ర, రిక్రాన్ దాల్మియా పాలీప్రో) ; డిజిటైజేషన్ వ్యాప్తి (రీసైకిల్) ; సేకరణ, ఎంపికను వ్యాప్తి చేయడం (నెప్రా రీసోర్స్ మేనేజ్‌మెంట్) ద్వారా పూరించే ప్రయత్నం చేస్తుంది.సీసీఓఎఫ్‌పెట్టుబడుల ద్వారా అందించే ఉత్ర్పేరక మూలధనం, సామర్థ్య విస్తరణకు నిధులు సమకూర్చడంతో పాటుగా పోర్ట్‌ఫోలియో కంపెనీలు తరువాత దశ వృద్ధి దిశగా పయణించేందుకు తోడ్పడుతుంది. ఫైనాన్సింగ్‌తో పాటుగా మెంటార్‌షిప్, సాంకేతిక నైపుణ్యం అందిస్తూనే తమ నెట్‌వర్క్ భాగస్వాములను సర్క్యులేట్ క్యాపిటల్ పరిచయం చేస్తుంది, తద్వారా వారు దీర్ఘకాలం పాటు వృద్ధి చెందుతారు.