Thu. Dec 12th, 2024
Indigenous Green Jackfruit Flour That Helps Control Blood Sugar, Now Recognised by American Diabetes Association

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ హైదరాబాద్, డిసెంబర్ 25,2020:భారతదేశం  లాంటి దేశాలలో, వైవిధ్యమైన వంటకాలు ,సక్రమం కాని ఆహార అలవాట్లు వంటివి మధుమేహ బారిన పడేలా చేస్తున్నాయి. ఇతర వ్యాధులకు ఆరంభంగా ఈ మధుమేహం నిలుస్తుంది. మన సంప్రదాయ వంటకాలు నిర్వచిత కార్బోహైడ్రేట్స్‌ పరంగా మహోన్నతమైనవి, మధుమేహ రోగులకు పరిమిత అవకాశాలు మాత్రమే ఉండటంతో పాటుగా వారు సాఽధారణంగా తప్పనిసరై అత్యధిక గ్లిసెమిక్‌ ఇండెక్స్‌ ఆహారం తీసుకుంటూ ఉంటారు.మైక్రోసాఫ్ట్‌,  ఫోర్ట్,3ఎం వంటి సంస్థలలో 25 సంవత్సరాల పాటు పనిచేసిన సాంకేతిక నిపుణులు జేమ్స్‌ జోసెఫ్‌,  అనుకోకుండా మధుమేహం కోసం గ్రీన్‌ జాక్‌ ఫ్రూట్‌ (పనసపండు) ప్రయోజనాలను కనుగొన్నారు. ఇదే ఆయనను పేటెంటెడ్‌ గ్రీన్‌ జాక్‌ ఫ్రూట్‌ ఫ్లోర్‌ అభివృద్ధి చేసేలా పురికొల్పింది. ఇది క్లీనికల్‌గా రక్తంలో చక్కెరస్థాయిని నియంత్రించగలదని నిరూపితమైంది. ఈ క్లీనికల్‌ అధ్యయన ఫలితాలను అమెరికన్‌ డయాబెటిస్‌ అసోసియేషన్‌ జర్నల్‌, డయాబెటీస్‌ ప్రచురించింది.యాథృచ్చికంగా, డబుల్‌ బ్లైండ్‌, ప్లాసెబొ నియంత్రిత అధ్యయన ఫలితాలను ఏడీఏ జర్నల్‌ డయాబెటీస్‌లో  ప్రచురించింది. ఈ అధ్యయనఫలితాలలో  హెచ్‌బీఏ1సీ గణనీయంగా తగ్గినట్లుగా గుర్తించారు.  ఈ అధ్యయనంలో పాల్గొన్న అభ్యర్థులలో 90 రోజుల లోపుగానే ఈ ఫలితాలను గమనించారు. వీరు 30 గ్రాముల జాక్‌ఫ్రూట్‌ 365 గ్రీన్‌ పనసపండు పొడిని ప్రతి రోజూ, 365 రోజులూ  తీసుకున్నారు. వీరు తమ డైట్‌ బదులుగా బియ్యం లేదా గోధుమ పిండి సమానంగా తీసుకున్నారు.

Indigenous Green Jackfruit Flour That Helps Control Blood Sugar, Now Recognised by American Diabetes Association
Indigenous Green Jackfruit Flour That Helps Control Blood Sugar, Now Recognised by American Diabetes Association

‘‘నేను ఇన్సులిన్‌ను 5 సంవత్సరాల పాటు తీసుకోవడంతో పాటుగా పసనపండు పొడి ప్రయోజనాలను బ్లడ్‌ షుగర్‌ నియంత్రణ పరంగా తెలుసుకున్నాను. ఓ టీవీ ఛానెల్‌ చర్చా కార్యక్రమంలో ఈ అంశం గురించి తొలిసారిగా విన్నాను. తెలుసుకోవాలనే ఆరాటం, కేరళ యొక్క జీవవైవిధ్యత పట్ల ఆసక్తితో నేను ఓ టేబుల్‌ స్పూన్‌ జాక్‌ఫ్రూట్‌ 365 పొడిని నా బ్రేక్‌ఫాస్ట్‌ తో పాటు తీసుకునేవాడిని. రెండు వారాలలోనే, నేను నా ఇన్సులిన్‌ స్థాయిని సగానికి తగ్గించగలిగాను. కేవలం రెండు నెలల్లోనే నా హెచ్‌బీఏ1సీ ఫలితాలు 8.3 నుంచి 7కు వచ్చినట్లుగా గుర్తించాను’’ అని డాక్టర్‌ ఉమ్మెన్‌ వీ ఉమ్మెన్‌, ఎమిరటస్‌ ప్రొఫెసర్‌, యూనివర్శిటీ ఆఫ్‌ కేరళ, అన్నారుమధుమేహం కోసం జాక్‌ఫ్రూట్‌ 365 ప్రయోజనాలు పలు అధ్యయనాలలో వెల్లడి అయ్యాయి. యూనివర్శిటీ ఆఫ్‌ సిడ్నీలో సైతం ఈ ఫలితాలు వెల్లడి అయ్యాయి. సిడ్నీ యూనివర్శిటీ గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ రీసెర్చ్‌ సర్వీస్‌ (ఎస్‌యుజీఐఆర్‌ఎస్‌) అధ్యయనం ప్రకారం జాక్‌ఫ్రూట్‌ 365 ను మధుమేహంతో బాధపడుతున్న వారు నియంత్రిత మొత్తంలో వినియోగించేందుకు అనువుగా ఉంటుంది. ఆ వ్యక్తుల వ్యక్తిగత డైటరీ అవసరాలపై ఆధారపడి ఇది ఉంటుంది. మరీ ముఖ్యంగా అత్యధిక జీఎల్‌ కార్బోహైడ్రేట్స్‌కు ప్రత్యామ్నాయంగా భోజనంలో దీనిని వాడవచ్చు అని వెల్లడించింది. ఈ అధ్యయనాన్ని 2016లో చేశారు.

Indigenous Green Jackfruit Flour That Helps Control Blood Sugar, Now Recognised by American Diabetes Association
Indigenous Green Jackfruit Flour That Helps Control Blood Sugar, Now Recognised by American Diabetes Association

అంతేకాదు, న్యూట్రిషనల్‌ గైసెమిక్‌ మరియు మధుమేహం కోసం ఎకోలాజికల్‌ ఎస్సెస్‌మెంట్‌ ఆఫ్‌ గ్రీన్‌ జాక్‌ఫ్రూట్‌ అంటూ కేరళలో  నిర్వహించిన కీలక అధ్యయనాలు చేశారు. ఈ ఫలితాలను ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ డయాబెటీస్‌ లో ప్రచురించారు. ఈ అధ్యయనం వెల్లడించేదాని ప్రకారం బియ్యంకు ప్రత్యామ్నాయంగా పనసపండును వినియోగించవచ్చు. దీనిలో ఫైబర్‌ అత్యధికంగా ఉండటంతో పాటుగా అతి తక్కువ కార్బోహైడ్రేట్స్‌, కేలరీలు, గ్లైసెమిక్‌ లోడ్‌ ఉంటుంది. అమెరికన్‌ డయాబెటీస్‌ అసోసియేషన్‌ ఔషద పోషక చికిత్స మార్గదర్శకాలకనుగుణంగా కూరగాయలను తీసుకోవడమూ వృద్ధి చేస్తుంది.జాక్‌ఫ్రూట్‌ 365 గ్రీన్‌ జాక్‌ఫ్రూట్‌ ఫ్లోర్‌ అత్యంత సౌకర్యవంతమైనది. ఇది ఆహారపు అలవాట్లును ఏ మాత్రం మార్చదు. వినియోగదారులు కేవలం తమ భోజనంతో పాటుగా ఒక్క స్పూన్‌ను తమ సాధారణ పిండికి జోడించడం లేదా   మైదాకు జోడించడం రోటీలను, ఇడ్లీలను లేదా దోశెలను వండుకోవచ్చు. ఇది ఆన్‌లైన్‌లో అమెజాన్‌, బిగ్‌బాస్కెట్‌, ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా లభ్యమవుతుంది.మధుమేహానికి చికిత్సగా పనసపండును కనుగొనడానికి ముందు,  దాదాపు 80% పనసపళ్లు వ్యర్థంగానే కేరళలో ఉండేవి. దీని పరిమాణం, ప్యాకేజింగ్‌, రవాణా సమస్యలు దీనికి కారణం. ప్రతి సంవత్సరం 2000 కోట్ల రూపాయల విలువైన పనసపండు కేరళలోవ్యర్థంగా మారుతుంది అని జేమ్స్‌ అంటున్నారు.ఒకప్పుడు వ్యర్థంగా భావించిన పండు, ఇప్పుడు మధుమేహ రోగుల కోసం పేటెంటెడ్‌ షుగర్‌ కంట్రోల్‌  పరిష్కారంగా మారింది.  తన నిరంతర ప్రయత్నాల కారణంగా శ్రీ జోసెఫ్‌ ఇప్పుడు పనసపండును నాసిరకపు ఆహారం నుంచి కేరళ అధికారిక పండుగా మార్చారు.

error: Content is protected !!