365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, డిసెంబర్ 31, 2020 ః టీబైక్ ఒన్ ప్రో ఆవిష్కరణ చేసిన స్మారా్ట్రన్ ఇండియా ఇప్పుడు తుది మైలు డెలివరీలు, కనెక్టవిటీ కోసం ఈ–బైక్,కార్గో డెలివరీ ప్లాట్‌ఫామ్ టీబైక్ ఫ్లెక్స్‌ను విడుదల చేసింది. టీబైక్ ఫ్లెక్స్ లో ట్రాన్క్స్ శక్తి ఉంది. ఇది ఎన్నో అనుకూలీకరించిన రవాణా,రైడర్ మేనేజ్మెంట్ ఫీచర్లు అందిస్తుంది. లాజిస్టిక్స్ పార్టనర్స్ స్ధానిక ఐటీ వ్యవస్థలు, ఈ–కామర్స్ కంపెనీలు,ఫుడ్ డెలివరీ ఆపరేటర్స్‌తో సులభంగా సమన్వయం చేసుకునేలా ఉండటంతో పాటుగా వాస్తవ సమయంలో బిజినెస్ ఇంటిలిజెన్స్‌ను సులభతరం చేస్తుంది. టీబైక్ ఫ్లెక్స్ ఇప్పుడు స్థానిక,హైపర్ లోకల్ డెలివరీ అవసరాలను తీర్చగలదని అంచనా. ఇది గణనీయంగా ఖర్చు తగ్గించడంతో పాటుగా సౌకర్యవంతంగా మారుస్తుంది. అంతేకాదు, టీబైక్ ఫ్లెక్స్ ఇప్పుడు మరింతగా కార్గో డెలివరీ స్టాఫ్‌కు అందుబాటులో ఉంటుంది. రైడర్ లైసెన్స్,వాహన రిజిస్ట్రేషన్ దీనికి అవసరం లేదు.టీబైక్ ఫ్లెక్స్ ధరలు 40వేల రూపాయల నుంచి ఆరంభం అవుతాయి. దీని ఫీచర్లలో విస్తృతస్థాయి కార్గో బైక్ ఫీచర్లు భవిష్యత్ ఎలక్ట్రిక్, ఏఐ , ఐఓటీ టెక్నాలజీస్ మిళితం అయి ఉంటాయి. దీనిలో ఎన్నో అనుకూలీకరించిన యాక్ససరీలు కూడా భాగంగా ఉంటాయి. ఈ అనుకూలీకరించిన ఫీచర్లు ఖచ్చితంగా భారీ వస్తువులను సైతం తీసుకువెళ్లగలిగే సామర్థ్యం కలిగి ఉన్నాయి. నగర పరిధిలో 40 కిలోమీటర్ల బరువును అతి సులభంగా తీసుకువెళ్లగలిగే రీతిలో ఉండటంతో పాటుగా రద్దీ ట్రాఫిక్‌లో సైతం సులభంగా వాహనం నడిపేందుకు వీలుగా ఉంటాయి. అతి తక్కువ పార్కింగ్ ఫుట్‌ప్రింట్ కలిగిన ఈ వాహనాలు సంప్రదాయ ఖరీదైన మోటార్బైక్స్కు ప్రత్యామ్నాయంగా నిలుస్తాయి. ఈ వాహన కార్గో బాక్స్‌లను ఎలాంటి వస్తువులు అయినా తీసుకువెళ్లగలిగే రీతిలో డిజైన్ చేశారు. టీబైక్ ఫ్లెక్స్ వాహనాలు గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఒక్కసారి చార్జ్ చేస్తే 75–120 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు.టీబైక్ ఫ్లెక్స్ వాహనాలలో ఈ విభాగంలో మొట్టమొదటిసారి అనతగ్గ ఫీచర్లు ఎన్నో ఉన్నాయి. హై –డెన్సిటీ స్వాపబల్ బ్యాటరీ ప్యాక్స్ దీనిలో ఉన్నాయి. ఇవి దాదాపు 150000 కిలోమీటర్ల అత్యధిక జీవిత చక్రం కలిగి ఉన్నాయి. ఇది స్థానిక డెలివరీ వ్యవస్థలు మరింత సౌకర్యవంతంగా తమ కార్యకలాపాలు నిర్వహించేందుకు తోడ్పడటంతో పాటుగా నిర్ధేశిత సమయాలలో కార్యక్రమాలను పూర్తిచేసేందుకు సైతం తోడ్పడుతుంది.

తమ స్మార్ట్ ,ఇంటిలిజెంట్ ట్రాన్క్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఖచ్చితమైన డాటాకు ఇది భరోసా అందిస్తుంది.దీని మినిమలిస్టిక్,ఆకర్షణీయమైన , పనితీరు పరంగా మెరుగ్గా ఉండే మరియు సౌందర్యపరమైన డిజైన్, కష్టం లేనట్టి రీతిలో సుదీర్ఘ సవారీకి భరోసా అందిస్తుంది. యాజమాన్య నిర్వహణ ఖర్చును టీబైక్ ఫ్లెక్స్ గణనీయంగా తగ్గించడంతో పాటుగా నిర్వహణ ఖర్చులు,కార్బన్ ఫుట్‌ప్రింట్‌ను సైతం తగ్గిస్తుంది. ఈ సరుకు రవాణా కంటెయినర్‌ను సౌకర్యవంతంగా ఉండేలా తీర్చిదిద్దారు ,ఆపరేటర్ల అవసరాలకు అనుగుణంగా దీనిని తీర్చిదిద్దారు. ఆధారపడతగిన లిథయం బ్యాటరీ, మరిన్ని కిలోమీటర్లు రైడర్లు వెళ్లేందుకు భరోసా అందిస్తుంది.మహేష్ లింగారెడ్డి, ఫౌండర్ అండ్ ఛైర్మన్, స్మారా్ట్రన్ మాట్లాడుతూ ‘‘ఆహారం, కిరాణా,ఇతర వస్తువులను వేగంగా,సమయానికి డెలివరీ చేయడానికి అనువైన కార్గో డెలివరీ వేదిక టీబైక్ ఫ్లెక్స్. ట్రాన్క్స్ శక్తివంతమైనది టీబైక్ ఫ్లెక్స్. తమ సొంతమైన ఏఐఓటీ ప్లాట్‌ఫామ్ కలిగి ఉండటం చేత ఇది పలు స్మార్ట్, ఇంటిలిజెంట్ ఫీచర్లను ఫ్లీట్ యజమానులు, రైడర్లు, తుది మైలు డెలివరీ ఆపరేటర్లకు అందిస్తుంది. వినియోగానికి సంబంధించి ఇంకా ప్రయాణించేటటువంటి దూరం, వినియోగ లక్షణాలు, సరాసరి వినియోగం, ధారణ, బృంద అంచనాలు వంటి వాటిపై వాస్తవ సమయంలో అంచనాలు సైతం పొందడానికి వీలు కల్పిస్తుంది. జియో ఫెన్సింగ్, రిమోట్ లాక్,ఇంటిగ్రేటెడ్ టీ కేర్ ఫీచర్లను సైతం ఇది అందిస్తుంది’’ అని అన్నారు.అనూప్ నిశాంత్, ఫౌండర్ అండ్ ఎండీ– ట్రాన్క్స్ మోటార్స్ (స్మారా్ట్రన్కు చెందిన ఈ –బైక్ కంపెనీ) మాట్లాడుతూ ‘‘భారతదేశంలో రూపొందించి, అభివృద్ధి చేయడంతో పాటుగా స్మారా్ట్రన్ ట్రాన్క్స్ చేత శక్తివంతమైన టీబైక్ ఫ్లెక్స్, భవిష్యత్‌కు సిద్ధమైన బైక్. ఇది అతి సులభమైన సవారీ అనుభవాన్ని, డిజైన్ సెన్సిబిలిటీ మిళితం చేసి అందిస్తుంది.

ఇది వైవిధ్యమైన కార్గో అవసరాలను సైతం తీరుస్తుంది. దేశవ్యాప్తంగా పలు నగరాలలో సర్వీస్,అమ్మకం తరువాత సేవలు స్మారా్ట్రన్ టీకేర్ ప్లాట్‌ఫామ్ ద్వారా లభ్యమవుతాయి. భారతదేశంతో పాటుగా మేము టీబైక్ ఫ్లెక్స్‌ను మెక్సికో, దక్షిణ అమెరికా దేశాలలో ప్రయోగాత్మకంగా పరిశీలించాం. ప్రమాణాలు, నిర్మాణ నాణ్యత, అతి సులభంగా వినియోగించే తీరు, యాజమాన్య ఖర్చు పరంగా అద్భుతమైన స్పందన అందుకున్నాం. కార్గో విభాగానికి సంబంధించి టీబైక్ ఫ్లెక్స్ అద్భుతమైన ఉత్పత్తిగా నిలువనుందనే విశ్వాసంతో ఉన్నాము’’ అని అన్నారు.