The Rashtrapati Bhavan Museum will be reopened for visitors from the 5th of this monthThe Rashtrapati Bhavan Museum will be reopened for visitors from the 5th of this month

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఢిల్లీ,జనవరి 1,2021: కరోనా కారణంగా గతేడాది మార్చి 13వ తేదీ నుంచి మూతబడిన రాష్ట్రపతి భవన్‌ మ్యూజియం కాంప్లెక్స్‌ను, సందర్శకుల కోసం ఈనెల 5 నుంచి మళ్లీ తెరవనున్నారు. సోమవారం, ప్రభుత్వ సెలవు దినాలు మినహా అన్ని రోజుల్లో ఇది తెరిచే ఉంటుంది. https://presidentofindia.nic.in లేదా https://rashtrapatisachivalaya.gov.in/ లేదా https://rbmuseum.gov.in/ ద్వారా సందర్శన సమయాన్ని ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవచ్చు. గతంలోలాగే సందర్శకుడికి రూ.50 చొప్పున నమోదు రుసుము ఉంటుంది. ఇంతకుముందు ఉన్న స్పాట్ బుకింగ్ సౌకర్యాన్ని తాత్కాలికంగా రద్దు చేశారు.సామాజిక దూరం నిబంధనలు అమలు కోసం, ఉదయం 9.30-11 గం.; ఉదయం 11.30-మధ్యాహ్నం 1 గం.; మధ్యాహ్నం 1.30-3 గం.; మధ్యాహ్నం 3.30-సాయంత్రం 5 గం. కాలవ్యవధితో నాలుగు ముందుస్తు బుకింగ్‌ స్లాట్లను అందుబాటులోకి తెచ్చారు. ఒక్కో స్లాట్‌లో గరిష్టంగా 25 మందిని మాత్రమే అనుమతిస్తారు. మాస్కులు, సామాజిక దూరం, ఆరోగ్య సేతు యాప్‌ వంటి కొవిడ్‌ ప్రొటోకాల్‌ను సందర్శకులు విధింగా పాటించాలి. కొవిడ్‌ సోకే అవకాశాలున్నవారిని ఈ పర్యటనకు అనుమతించరు. రాష్ట్రపతి భవన్ మ్యూజియం కాంప్లెక్స్ అనేది అంశాల వారీగా చరిత్రను వివరించే ప్రదర్శనశాల. కళ, సంస్కృతి, వారసత్వం, చరిత్రకు చిహ్నాలైన వెలకట్టలేని కళాఖండాలు ఇక్కడ ఉన్నాయి. https://rbmuseum.gov.in/ లో మరిన్ని వివరాలను చూడవచ్చు.