Fri. Nov 22nd, 2024
OMRON Healthcare expands its reach in South India Inaugurates experience & service center at Hyderabad

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,హైదరాబాద్‌, ఫిబ్రవరి 12,2021 డిజిటల్‌ రక్తపోటు పర్యవేక్షణ విభాగంలో అంతర్జాతీయంగా అగ్రగామిగా ఉన్న ఒమ్రాన్‌ హెల్త్‌కేర్‌ ఇండియా నేడు తమ తరువాత తరపు అనుభవ,సేవా కేంద్రాన్నిహైదరాబాద్‌లో ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. ఈ కేంద్రంతో , ఎక్స్‌పీరియన్స్‌, సేవా,పికప్‌ కేంద్రాలతో సహా భారతదేశ వ్యాప్తంగా ఓమ్రాన్‌కు ఇప్పుడు 64 టచ్‌ పాయింట్లు ఉన్నాయి. వినియోగదారులను బ్రిక్‌ అండ్‌ మోర్టార్‌ స్టోర్ల ద్వారా చేరుకోవాలనే కంపెనీ నిబద్ధతను ఇది ప్రతి బింబించడంతో పాటుగా ఈ–కామర్స్‌ విభాగంలో తమ లభ్యతను సైతం బలోపేతం చేస్తుంది. తద్వారా ఒమ్రాన్‌ ఉత్పత్తుల వినియోగాన్ని ఆస్వాదించే అవకాశం వినియోగదారులకు కలుగడంతో పాటుగా వేగవంతంగా నాణ్యమైన మరమ్మత్తులు,సేవలను అందించడమూ వీలవుతుంది.ఈ ఆరంభం గురించి మసనోరి మత్సుబార,ఎండీ, ఒమ్రాన్‌ హెల్త్‌కేర్‌ ఇండియా మాట్లాడుతూ ‘‘సాంకేతికతలో వృద్ధిచెందుతున్న మార్పులతో పాటుగా కోవిడ్‌ అనంతర కాలంలో నివారణ ఆరోగ్య సంరక్షణ చుట్టూ మారుతున్న అంశాల
కారణంగా, వినియోగదారులకు అనుభవం కూడా కావాల్సి వస్తుంది. తద్వారా వారు నివారణ ఆరోగ్య సంరక్షణ నిర్వహణను తమ రోజువారీ కార్యక్రమాలలో భాగం చేసుకోగలరు. ఒమ్రాన్ఎ క్స్‌పీరియన్స్‌ కేంద్రం, పలు ఉత్పత్తులను వాస్తవంగా ప్రదర్శించడం ద్వారా ఉత్పత్తి అనుభవాలను అందించడాన్ని లక్ష్యంగా చేసుకోవడంతో పాటుగా సంపూర్ణమైన రీతిలో విస్తృత స్థాయి మరమ్మత్తుల సేవలను అందించడాన్ని లక్ష్యంగా చేసుకుంది. వీటిలో రన్‌ ఆఫ్‌ ద మిల్‌ కాలిబ్రేషన్‌ అంశాలతో పాటుగా అత్యాధునిక సాంకేతిక జోక్యాలు సైతం భాగంగా ఉంటాయి’’ అని అన్నారు.కోవిడ్‌ అనంతరం, అధిక శాతంమంది భారతీయులు డిజిటల్‌ బ్లడ్‌ ప్రెషర్‌ మానిటర్స్‌ (బీపీఎంలు)ను తమ కీలక
పారామీటర్లును ప్రభావంతంగా పర్యవేక్షించేందుకు కొనుగోలు చేశారు.

OMRON Healthcare expands its reach in South India Inaugurates experience & service center at Hyderabad
OMRON Healthcare expands its reach in South India Inaugurates experience & service center at Hyderabad

ఈ బ్రాండ్‌ బీపీఎంలకు కోవిడ్‌ అనంతర కాలంలో దాదాపు 30% డిమాండ్‌, అమ్మకాలు పెరిగాయి.ఈ కేంద్రంలో ప్రత్యేకంగా ఎక్స్‌పీరియన్స్‌ జోన్‌ ఉంది. ఇది వినియోగదారులకు విస్తృతశ్రేణి ఒమ్రాన్‌ ఉత్పత్తుల కోసంప్రత్యక్ష డెమోను సైతం అందిస్తుంది. తొలుత ప్రతి రోజూ 100 మందికి పైగా వినియోగదారుల అవసరాలను ఇది తీర్చనుందని అంచనా. ఇక్కడ వారు వేగవంతంగా తమ సందేహాలను నివృత్తి చేసుకోవడంతో పాటుగా ఈ ఉత్పత్తులను ఏ విధంగా వినియోగించవచ్చో కూడా తెలుపుతారు.ఈ ఆవిష్కరణ గురించి మరింతగా రోహిత్‌ సైనీ, జీఎం–సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌, ఒమ్రాన్‌ హెల్త్‌కేర్‌ ఇండియా మాట్లాడుతూ నూతన మార్గాలను స్వీకరిస్తోన్న వేళ, సంప్రదాయ ఛానెల్స్‌లో కూడా ఒమ్రాన్‌ తన ఉనికిని బలంగా,సజీవంగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది. తద్వారా మానవ సంబంధాల పరంగా వినియోగదారులతో విస్తృత శ్రేణి అనుబంధం ఏర్పరుచుకోవడానికి మేము ఎలాంటి లోపాన్ని ఎత్తి చూపే అవకాశం కల్పించడం లేదు. సాంకేతిక
అనుభవాలను వినియోగదారులు పొందేలా చేయడమే మా లక్ష్యం.తద్వారా వారు వేగంగా దీనిని స్వీకరించడం తో పాటుగా అత్యుత్తమంగా వినియోగదారుల సేవా అనుభవాలను సైతం పొందగలరు.

OMRON Healthcare expands its reach in South India Inaugurates experience & service center at Hyderabad
OMRON Healthcare expands its reach in South India Inaugurates experience & service center at Hyderabad

నూతన సాధారణత వేళ ఆరోగ్యవంతమైన జీవనశైలి అనుసరించేందుకు తోడ్పడాలనే మా లక్ష్యానికి అనుగుణంగా ఇదిఉంటుంది’’ అని అన్నారు.నాణ్యమైన వైద్య ఉపకరణాలు అయినటువంటి బ్లడ్‌ ప్రెషర్‌ మానిటర్లు, నెబులైజర్లు, థర్మోమీటర్లు, నెర్వ్‌ స్టిమ్యులేటర్లు, బాడీ ఫ్యాట్‌ మానిటర్లు, వెయింగ్‌ స్కేల్స్‌ మొదలైన వాటిని అందించడం ద్వారా గృహ ఆరోగ్య పర్యవేక్షణ అభ్యాసాన్ని అందించడంతో తమ సుదీర్ఘకాల జీరో ఈవెంట్స్‌ విజన్‌ (గుండె పోటు,బ్రెయిన్‌స్ట్రోక్స్‌)సాకారం చేసే దిశగా మరో అడుగును ముందుకు వేయడాన్ని ఓమ్రాన్ఈ కేంద్రం సూచిస్తుందని మత్సుబార అన్నారు.

error: Content is protected !!