365తెలుగు కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా,ఫిబ్రవరి22, 2021 ః నిర్మాణ,గనులకు సంబంధించిన యంత్ర సామాగ్రికి సంబంధించిన అతిపెద్ద తయారీదారు కాటర్ పిల్లర్, భారతదేశంలో 50 వసంతాల తయారీని వేడుక చేస్తుంది. ఈ కంపెనీకి సుదీర్ఘమైన చరిత్ర ఉంది. విప్లవాత్మక సాంకేతికత కలిగిన దీని యంత్రాలు భద్రతను మెరుగుపరచడంతో పాటుగా, ఉత్పాదకత, తమ నిర్వహణ రంగాలలో సామర్థ్యమూ వృద్ధి చెందేలా చేస్తుంది. అంతర్జాతీయంగా, కాటర్ పిల్లర్‌కు 95 సంవత్సరాల ఉత్పత్తి మద్దతు నైపుణ్యం ఉంది. భారీ ఇన్‌స్టాల్డ్ బేస్ (దాదాపు రెండు మిలియన్ ఆస్తులు) విస్తృత శ్రేణిలో అంతర్జాతీయంగా డీలర్ నెట్‌వర్క్ ఉంది. ప్రపంచ వ్యాప్తంగా 193 దేశాలలో దాదాపు 1,60,000 మంది ఉద్యోగులు సంస్ధకు ఉన్నారు.భారతదేశంలో ఈ కంపెనీ 1930 నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తుంది. కాటర్ పిల్లర్‌కు ఇక్కడ ఆరు అత్యాధునిక తయారీ కేంద్రాలు, రెండు ఆర్ అండ్ డీ కేంద్రాలు, ఐదు సబ్సిడరీ సంస్థలు, ఎనిమిది కాటర్‌పిల్లర్ బ్రాండ్స్, పలు అంతర్జాతీయ మద్దతు సంస్థలు ఉన్నాయి.

సంస్థ వారసత్వం భారతదేశం, అంతర్జాతీయంగా తమ వినియోగదారుల అవసరాలను తీర్చేందుకు సాటిలేని నిబద్ధత, అత్యాధునిక శ్రేణి ఉత్పత్తుల పరిష్కారాలు, సేవల ఆవిష్కరణలో కంపెనీ వ్యూహాం ప్రతిబింబిస్తుంది. కాటర్ పిల్లర్, దాని బలీయమైన డీలర్ నెట్‌వర్క్‌లు కలిసి దాదాపు 11వేల మందికి ప్రత్యక్షంగా భారతదేశంలోని తమ స్థానిక సరఫరా ద్వారా అంతకు మించి పరోక్షంగా ఉపాధిని కల్పిస్తున్నాయి.‘‘ఎన్నో దశాబ్దాలుగా భారతదేశపు వృద్ధి కథలో కాటర్‌పిల్లర్ ఓ భాగంగా ఉంది. మేము 1930 నుంచి కీలకమైన భాగస్వామిగా ఉన్నాం ఈ మహోన్నత దేశాభివృద్ధికి ప్రత్యక్ష సాక్షిగానూ నిలిచాం’’ అని కాటర్‌పిల్లర్ ఛైర్మన్ అండ్ సీఈవో జిమ్ ఉంప్ల్బీ అన్నారు. యుఎస్–ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఫోరమ్‌లో బోర్డ్ సభ్యులు ఉంప్ల్బీ. ఆయన మాట్లాడుతూ ‘‘మా వినియోగదారులకు సేవా నాణ్యతను అందించాలనే మా భారత బృందం అంకితభావం ఈ మైలురాయి వార్షికోత్సవం చేరుకోవడంలో అత్యంత కీలకంగా ఉంది’’ అని అన్నారు.

‘‘ఈ సంవత్సరం మా గోల్డెన్ జూబ్లీ వార్షికోత్సవానికి ప్రతీకగా నిలుస్తుంది. భారతదేశంలో మా 50 వసంతాల తయారీకి ప్రతీకగా ఇది నిలుస్తుంది’’ అని కాటర్‌పిల్లర్ ఇండియా కంట్రీ మేనేజర్ బన్సీ ఫన్సాల్కర్ అన్నారు. ‘‘ ఇక్కడ ప్రతిష్టాత్మకంగా చెప్పాల్సిన అంశం ఏమిటంటే, 1948లో భాక్రానంగల్ డ్యామ్ నిర్మాణ సమయంలో కాట్ యంత్రసామాగ్రిని వినియోగించారు. గనులు, నిర్మాణం, రవాణా, విద్యుత్ ఉత్పతిత, మౌలిక వసతుల అభివృద్ధి రంగాలలో భారతదేశపు వృద్ధికి కాటర్‌పిల్లర్ మద్దతునందించింది’’ అని ఆయన వెల్లడించారు.సుస్థిరమైన సమాజం కోసం కాటర్‌పిల్లర్ నిబద్ధతను గురించి శ్రీ ఫన్సాల్కర్ మరింతగా వెల్లడిస్తూ ‘‘నాణ్యమైన విద్య, స్వచ్ఛమైన తాగునీరును అందుబాటులో ఉంచడం, పరిశుభ్రత నైఫుణ్యాభివృద్ధి రంగాలపై దృష్టి సారించి పలు సీఎస్‌ఆర్ కార్యక్రమాలను మేము కార్యకలాపాలు నిర్వహిస్తున్న చోట చేస్తున్నాము’’ అని అన్నారు.నిర్మాణ గనుల యంత్రసామాగ్రికి సంబంధించి అతి పెద్ద ఎగుమతిదారునిగా కాటర్ పిల్లర్ నిలుస్తుంది ప్రపంచశ్రేణి ఉత్పత్తులు, అమ్మకం తరువాత సేవా పరిష్కారాలను భారతదేశంతో పాటుగా ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులకు అందించడంపై దృష్టి సారించింది.