Fri. Oct 18th, 2024
Muthyala Rajendra Vikhyat from Rao’s Degree College, emerges as winner of the Cluster 1 Finals, in the all new online edition of Tata Crucible Campus Quiz

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,నెల్లూరు, మార్చి 09,2021:క్యాంపస్‌ల కోసం భారతదేశపు అతిపెద్ద బిజినెస్‌ క్విజ్‌ టాటా క్రూసిబల్‌ క్యాంపస్‌ క్విజ్‌ పూర్తి సరికొత్త ఆన్‌లైన్‌ ఎడిషన్‌ క్లస్టర్‌ 1 ఫైనల్స్‌లో రావుస్‌ డిగ్రీ కాలేజీకి చెందిన ముత్యాల రాజేంద్ర విఖ్యాత్‌ విజేతగా నిలిచారు.ఈ క్లస్టర్‌ 1 ఫైనల్స్‌కు ఆంధ్రప్రదేశ్‌ ప్రాంతం ప్రాతినిథ్యం వహిస్తుంది. ఈ పోటీలో పాల్గొన్న అభ్యర్థులు తమ వేగవంతమైన ఆలోచనలు, క్విజ్జింగ్‌ సామర్థ్యం ప్రదర్శించారు. విజేతగా నిలిచిన రాజేంద్ర కు 35 వేల రూపాయల నగదు బహుమతి అందజేశారు. ఆయన ఇప్పుడు జోనల్‌ ఫైనల్స్‌లో పోటీపడతారు. అక్కడ కూడా విజేతగా నిలిస్తే జాతీయ ఫైనల్స్‌కు వెళ్తారు. ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం) విశాఖపట్నంకు చెందిన కనవ్‌ మెహ్రా ద్వితీయ స్ధానంలో నిలిచి 18 వేల రూపాయల నగదు బహుమతి అందుకున్నారు. హైదరాబాద్‌లోని వివాంత హోటల్‌ జనరల్‌ మేనేజర్‌ శ్రీ హితేంద్ర శర్మ ఈ పోటీలకు ముఖ్య అతిథిగా విచ్చేయడంతో పాటుగా వర్ట్యువల్‌గా బహుమతులను అందజేశారు.

Muthyala Rajendra Vikhyat from Rao’s Degree College, emerges as winner of the Cluster 1 Finals, in the all new online edition of Tata Crucible Campus Quiz
Muthyala Rajendra Vikhyat from Rao’s Degree College, emerges as winner of the Cluster 1 Finals, in the all new online edition of Tata Crucible Campus Quiz

error: Content is protected !!