Will be touring in Bhopal - Dr. Harsha Vardhan NIREH The Union Minister will inaugurate various facilities at the Bhopal Aims along with the new campus belonging toWill be touring in Bhopal - Dr. Harsha Vardhan NIREH The Union Minister will inaugurate various facilities at the Bhopal Aims along with the new campus belonging to

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,ఢిల్లీ,మర్చి 13,2021: కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ భోపాల్ పర్యటనను ప్రారంభించనున్నారు. 2021 మార్చి, 13వ తేదీన, ఆయన, భోపాల్ లోని పర్యావరణ ఆరోగ్యంలో పరిశోధనకు చెందిన జాతీయ సంస్థ నూతన హరిత ప్రాంగణాన్ని ఆయన  ప్రారంభించనున్నారు. దీనితో పాటు, భోపాల్ ఎయిమ్స్ లో వివిధ సదుపాయాలను కూడా ఆయన ఈ సందర్భంగా  ప్రారంభించనున్నారు.ఆ తరువాత, ఆయన, కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి హోదాలో, భోపాల్‌లోని సి.ఎస్.‌ఐ.ఆర్-ఎ.ఎమ్.‌పి.ఆర్.‌ఐ. లో జరిగే కార్యక్రమాలకు కూడా హాజరుకానున్నారు. ఎన్.ఐ.ఆర్.ఈ.హెచ్. కొత్త హరిత ప్రాంగణాన్ని,కేంద్ర ఆరోగ్య మంత్రి,మధ్యాహ్నం ప్రారంభిస్తారు.మధ్యాహ్నం 2 గంటలకు, ఆయన, పరిపాలనా భవన నిర్మాణానికి శంకుస్థాపన  చేస్తారు, అనంతరం, భోపాల్ లోని ఎయిమ్స్ లో నూతనంగా నిర్మించిన ఆడిటోరియం,నైపుణ్య  ప్రయోగశాలలను, ఆయన సమాజానికి అంకితం చేస్తారు.ఆ తర్వాత,  ఐ.సి.ఎం.ఆర్. క్యాన్సర్ చికిత్సా కేంద్రం (సి.టి.సి) సంయుక్త సహకారంతో ఏర్పాటు చేసిన మైకాలజీ అడ్వాన్స్‌ రిసోర్స్ సెంటర్ (ఎం.ఏ.ఆర్.సి) ని కూడా ఆయన ప్రారంభించనున్నారు. మొక్కలు నాటే కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొంటారు. అనంతరం, కోక్లియర్ (కంబు నాడి) మార్చిన రోగులతో నిర్వహించే ముఖాముఖీ కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొంటారు. 

Will be touring in Bhopal - Dr. Harsha Vardhan NIREH The Union Minister will inaugurate various facilities at the Bhopal Aims along with the new campus belonging to
Will be touring in Bhopal – Dr. Harsha Vardhan NIREH The Union Minister will inaugurate various facilities at the Bhopal Aims along with the new campus belonging to

భోపాల్ ‌లోని సి.ఎస్.‌ఐ.ఆర్-ఎ.ఎమ్.‌పి.ఆర్.‌ఐ. లో సాయంత్రం 4 గంటల 15 నిముషాలకు ఏర్పాటు చేసే కార్యక్రమంలో డాక్టర్ హర్ష వర్ధన్,  సి.ఎస్.‌ఐ.ఆర్-ఎ.ఎమ్.‌పి.ఆర్.‌ఐ. వెదురు మిశ్రమ నిర్మాణం / సైట్ కు శంకుస్థాపన చేస్తారు.  అనంతరం, సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ రేడియేషన్ షీల్డింగ్ & జియోపాలిమెరిక్ మెటీరియల్స్ (సి.ఏ.ఆర్.ఎస్. & జి.ఎమ్) కేంద్రంలో, అనలిటికల్ హై రిజల్యూషన్ ట్రాన్స్మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ (హెచ్.ఆర్.టి.ఈ.ఎమ్) సదుపాయాన్ని కూడా కేంద్ర మంత్రి ప్రారంభిస్తారు.  సాంకేతిక ప్రదర్శనను సందర్శించిన తరువాత, ఆయన, పారిశ్రామిక భాగస్వాములతో సంభాషిస్తారు. వారితో చర్చల అనంతరం, సి.ఎస్.ఐ.ఆర్-ఏ.ఎమ్.పి.ఆర్.ఐ. రూపొందించిన ఫ్లై యాష్ కాంపెడియంను కూడా, కేంద్ర మంత్రి విడుదల చేయనున్నారు.డాక్టర్ హర్ష వర్ధన్, ఈ రోజు,తమ పర్యటనలో భాగంగా పాల్గొనే చివరి అంశంగా ,ఈ సాయంత్రం 6 గంటల 30 నిముషాల నుండి రాత్రి 7 గంటల వరకు,భోపాల్ లోని సి.ఎస్.ఐ.ఆర్-ఏ.ఎం.పి. ఆర్.ఐ. లో,మధ్యప్రదేశ్ కు చెందిన ఎం.ఎస్.ఎం.ఈ. మంత్రిత్వ శాఖ; ఎమ్.పి.సి.ఎస్.టి;విజ్ఞాన్ భారతి,సి.ఎస్. ఐ.ఆర్. మధ్య కుదిరిన అవగాహనా ఒప్పందంపై సంతకం చేసే కార్యక్రమంలో పాల్గొంటారు.