![](http://365telugu.com/wp-content/uploads/2021/06/VOOT-0-1-1024x576.jpg)
365తెలుగు డాట్ కామ్, ఆన్ లైన్ న్యూస్ ,హైదరాబాద్,జూన్ 2 : ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ వూట్ తమ ప్రేక్షకులకు సరికొత్త వెబ్ సిరీస్ ను అందించేందుకు సిద్ధమైంది. ఖ్వాబో కే పరిందే ఒరిజినల్ తో వస్తున్నది. నిరీక్షణ, జీవితాన్ని తిరిగి కనుక్కోవడం, ఒకరి పట్ల ఒకరు నమ్మకంగా ఉంటూ సహకరించుకోవటం వంటి వాటి ద్వారా ప్రేక్షకుల్ని మరింత లీనమయ్యేలా చేస్తుంది, ముగ్గురు స్నేహితులు – బిందియా, దీక్షిత్ , మేఘా తమ మనస్సుకు తగిలిన గాయాలను నయం చేసుకోడానికి, ప్రేమలో పడటానికి ,వారికున్న అనవసర భయాలను ఎదుర్కోవటానికి మెల్బోర్న్ నుంచి పెర్త్ కు ప్రయాణమవుతారు. ఈ జర్నీని ఎంతో ఇంటరెస్ట్ గా చిత్రీకరించారు. “ఈ అద్భుతమైన సిబ్బందితో ఆస్ట్రేలియా అంతటా 60 రోజుల షూటింగ్ మరపురాని అనుభవం.. నేను బిందియా పాత్రలో నటించడంద్వారా ఎంతో సంతోషాన్ని పొందాను “అని ఆశా నేగి పేర్కొన్నారు. సవాలుగా ఉన్నప్పటికీ, టెలివిజన్ నుంచి వెబ్‌కు నా పాత్రల మార్పు చాలా రిఫ్రెష్‌గా ఉంది. నటిగానే కాకుండా నన్ను వ్యక్తిగతంగా కూడా సవాలు చేసిన ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు నా రాక్‌స్టార్ దర్శకుడు తపస్వి మెహతా ,Voot లకు చాలా ధన్యవాదాలు.” అని ఆశా నేగి తెలిపారు. ఖ్వాబోన్ కే పరిందే ఈ నెలలో ప్రత్యేకంగా Voot లో ప్రసారం కానుంది.
![voots new original khwabon ke parindey is an unexpected journey of three friends](http://365telugu.com/wp-content/uploads/2021/06/VOOT-1-1.jpg)
నిజమైన స్నేహాలను గుర్తుచేసుకున్న ఆశా నేగి “ఖ్వాబోన్ కే పరిందే కి సంబంధించిఆసక్తికరమైనవిషయాలనుపంచుకున్నారు. జీవితం,ఆశప్రయాణం, కానీ కొన్నిసార్లు మిమ్మల్ని మీరు తిరిగి కనుగొనడంలో సహాయపడటానికి సన్నిహితులు కావాలి. బిందియా, ఈ ప్రోగ్రాంలో నా పాత్ర పూర్తి మొరటు అమ్మాయిగా ఉంటుంది. ఎప్పుడైనా మీరు ఇలాంటి ప్రోగ్రాం కోసం షూటింగ్ లో పాల్గొన్నప్పుడు, మీరు మీ మంచి స్నేహితులతో ఉన్న క్షణాలను తిరిగి ఫీలవుతారు. నేను కూడా అలాగే అనుభూతి చెందాను’ అని ఆశా నేగి తెలిపారు.