365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్,న్యూస్,హైదరాబాద్, జూన్ 13,2021:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 32 జిల్లాల అడిషనల్ కలెక్టర్లకు కొత్త కియా కార్నివాల్ వాహనాలు మంజూరు చేసింది. రవాణా శాఖ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్లను కొనుగోలు చేసింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సూచనల మేరకు ఆదివారం ప్రగతి భవన్ లో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తో కలిసి లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు.
![Transport Minister launches new Kia cars for additional collectors](http://365telugu.com/wp-content/uploads/2021/06/kia-cars-1024x768.jpg)
మంత్రితో పాటు పంచాయత్ రాజ్ కార్యదర్శి సందీప్ సుల్తానియా, రవాణా శాఖ కమిషనర్ ఎం.ఆర్.ఎం.రావు , ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.