

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి, 2021 జూన్ 22: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం స్వామివారి కల్యాణోత్సవం ఏకాంతంగా జరిగింది.సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, కంకణధారణ, అగ్నిప్రతిష్టాపన, యజమాని సంకల్పం, మహాసంకల్పం, మంగళసూత్రధారణ ఘట్టాలతో స్వామివారి కల్యాణాన్ని నిర్వహించారు. చివరిగా నక్షత్రహారతి, మంగళహారతి కార్యక్రమంతో కల్యాణం ముగిసింది.

