
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,హైదరాబాద్, జూన్ 29,2021: తెలంగాణ డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాల ప్రకటన విడుదలైంది. జులై 1 నుంచి 15వరకు దోస్త్ రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని దోస్త్ కన్వీనర్ లింబాద్రి గౌడ్ తెలిపారు. ‘‘జులై 3 నుంచి 16వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఉంటుందని జులై 22న మొదటి విడత డిగ్రీ సీట్ల కేటాయింపు ఉంటుందని, జులై 23 నుంచి 27 వరకు రెండో విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు జరగుతాయని ఆయన పేర్కొన్నారు.

ఆగస్టు 4న రెండో విడత డిగ్రీ సీట్లను కేటాయిస్తాం. ఆగస్టు 5 నుంచి 10 వరకు మూడో విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు కొనసాగిస్తామని, ఆగస్టు 6 నుంచి 11వరకు మూడో విడత వెబ్ ఆప్షన్లు, ఆగస్టు 18 నుంచి మూడో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు, సెప్టెంబరు 1 నుంచి డిగ్రీ మొదటి సంవత్సరం తరగతులు జరుగుతాయి’’ అని దోస్త్ కన్వీనర్ వివరించారు.