

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,జూన్ 29,2021 : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందరరాజ స్వామివారి అవతారోత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఈ ఉత్సవాలను ఆలయ ప్రాంగణంలో ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.

ఇందులోభాగంగా మధ్యాహ్నం 2.30 నుంచి 4 గంటల వరకు శ్రీ కృష్ణస్వామి ముఖమండపంలో శ్రీ సుందరరాజస్వామివారి ఉత్సవర్లకు తిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉత్సవర్లకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు. అనంతరం సాయంత్రం శ్రీ సుందరరాజస్వామివారికి ఊంజల్ సేవ నిర్వహించారు.