CPWD celebrates its 167th Annual DayCPWD celebrates its 167th Annual Day
CPWD celebrates its 167th Annual Day
CPWD celebrates its 167th Annual Day

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,ఢిల్లీ,జూలై 13, 2021:దేశానికి 167 ఏళ్లుగా అందిస్తున్న అద్భుత సేవలకు గుర్తుగా, ‘కేంద్ర ప్రజా పనుల విభాగం’ (సీపీడబ్ల్యూడీ) తన 167వ వార్షికోత్సవం జరుపుకుంది. కొవిడ్‌ను దృష్టిలో ఉంచుకుని, నిరాడంబరంగా, డిజిటల్‌ పద్ధతిలో కార్యక్రమం నిర్వహించారు.

    కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ‘ముఖ్య అతిథి’గా, సహాయ మంత్రి కౌశల్ కిషోర్ ‘గౌరవ అతిథి’గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రిత్వ శాఖ కార్యదర్శి దుర్గాశంకర్ మిశ్రా కూడా పాల్గొన్నారు.

CPWD celebrates its 167th Annual Day
CPWD celebrates its 167th Annual Day

    నాలుగు సాంకేతిక ప్రచురణలు, “సీపీడబ్ల్యూడీ ఫ్లోరల్ టేబులక్స్: ఏ ట్రెజర్ కలెక్షన్”, “ఈఆర్‌పీ ఈ-మాడ్యూల్స్”, “నిర్మాణ్‌ భారతి – ఇన్‌ హౌస్‌ పబ్లికేషన్‌ ఆఫ్‌ సీపీడబ్ల్యూడీ”, “సీపీడబ్ల్యూడీ టెలిఫోన్ డైరెక్టరీ 2021″ను ఈ సందర్భంగా ముఖ్యులు ఆవిష్కరించారు. సీపీడబ్ల్యూడీ కార్యక్రమాలు, విజయాలను వివరించే లఘుచిత్రాన్ని కూడా ప్రదర్శించారు.

    ఈ విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు సీపీడబ్ల్యూడీ పతకాలను ప్రదానం చేశారు. తర్వాత, సాంకేతిక అంశాలపై సీపీడబ్ల్యూడీ అధికారులు, ఇతర నిపుణులు  ప్రదర్శనలు ఇచ్చారు.