365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,జూలై 16, 2021: భారతదేశపు ప్రముఖ ఫ్యాషన్, బ్యూటీ ఉత్పత్తులకు గమ్యస్థానంగా ఉన్న షాపర్స్ స్టాప్, ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ ‘My Sale, My Way’ ను ప్రకటించింది. జూలై 22 నుంచి ప్రారంభమయ్యే ఈ సేల్‌లో జూలై 19 నుంచి జూలై 21కు ఈ సేల్ ప్రత్యేకంగా ఫస్ట్ సిటిజన్ ప్రివ్యూ ఉంటుంది. కస్టమర్లు తమకు నచ్చింది ఎంచుకునే స్వేచ్ఛను ఈ అద్భుతమైన సేల్ అందిస్తుంది. సోషల్ మీడియాలో పోల్స్ నిర్వహించి కస్టమర్ల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకొని మై సేల్, మై వే డిజైన్ చేయబడుతుంది.
దేశంలోని 200లకు పైగా బ్రాండ్లపై 50% వరకు కట్టిపడేసే డిస్కౌంట్‌తో పాటు మీకు నచ్చిన రీతిలో అంటే వెబ్‌సైట్, యాప్, ఇన్-స్టోర్, ఎక్స్‌ప్రెస్ స్టోర్ పికప్ ద్వారా మీరు షాపింగ్ చేసుకోవచ్చు. అంతే కాదు వైట్ గ్లోవ్ ద్వారా వాట్సప్‌లో వ్యక్తిగత షాపర్ సర్వీసు కూడా అందుబాటులో ఉంది. దీని ద్వారా మీరు హాయిగా కూర్చొని విశ్రాంతి తీసుకుంటుంటే మీ స్టైల్ ఆధారంగా మేము ప్రొడక్ట్స్ ఎంపిక చేస్తాం.
బ్యూటీ, అపరెల్, ఫుట్‌వేర్, హోమ్ డెకొర్, యాక్సెసరీస్ ఇంకా మీకు నచ్చిన అనేక కేటగిరీల్లో అతి పెద్ద సేల్‌కు సిద్ధం కండి. మీకు ఎలా కావాలో, మీకు ఏం కావాలో, మీకు ఎక్కడి నుంచి కావాలో నచ్చినట్టుగా షాపింగ్ చేసుకోండి