Wed. Oct 16th, 2024
PUSHPAYAGAM HELD IN APPALAYAGUNTA
PUSHPAYAGAM HELD IN APPALAYAGUNTA
PUSHPAYAGAM HELD IN APPALAYAGUNTA
PUSHPAYAGAM HELD IN APPALAYAGUNTA
PUSHPAYAGAM HELD IN APPALAYAGUNTA

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుపతి, జూలై 25,2021: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఆదివారం శాస్త్రోక్తంగా పుష్పయాగం జరిగింది.

PUSHPAYAGAM HELD IN APPALAYAGUNTA
PUSHPAYAGAM HELD IN APPALAYAGUNTA
PUSHPAYAGAM HELD IN APPALAYAGUNTA
PUSHPAYAGAM HELD IN APPALAYAGUNTA

ఇందులో భాగంగా ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు ఉభయదేవేరులతో కూడిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, ప‌సుపు, చందనంల‌తో విశేషంగా అభిషేకం చేశారు.

PUSHPAYAGAM HELD IN APPALAYAGUNTA
PUSHPAYAGAM HELD IN APPALAYAGUNTA
PUSHPAYAGAM HELD IN APPALAYAGUNTA
PUSHPAYAGAM HELD IN APPALAYAGUNTA

ముందుగా పుష్పయాగం కోసం వినియోగించే పుష్పాలను ఆలయంలో మూలమూర్తి వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వేదికపై సర్వభూపాల వాహనంలో శ్రీ‌దేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారిని కొలువుతీర్చారు. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ పుష్పయాగం జరిగింది.

PUSHPAYAGAM HELD IN APPALAYAGUNTA
PUSHPAYAGAM HELD IN APPALAYAGUNTA

ఈ సందర్భంగా జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి మాట్లాడుతూ ఆల‌యంలో జూన్ 19 నుంచి 27వ తేదీ వరకు వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగాయన్నారు. ఈ ఉత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలిసీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంద‌ని చెప్పారు.

PUSHPAYAGAM HELD IN APPALAYAGUNTA
PUSHPAYAGAM HELD IN APPALAYAGUNTA

ఇందులో తులసి, మల్లి, కనకాంబరం, చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, రోజా, కలువలు వంటి 18 రకాలకు చెందిన పుష్పాలు, పత్రాలతో పుష్పయాగం నిర్వహించారన్నారు.

error: Content is protected !!