365తెలుగు డాట్ కామ్ ఆన్లైన్ న్యూస్,హైదరాబాద్, ఆగస్టు17, 2021: భారతదేశపు నాలుగో అతి పెద్ద రోగనిర్థారరణ సేవల సంస్థ న్యూబర్గ్ డయాగ్నాస్టిక్స్, తన న్యూబర్గ్ ఆరోగ్యం, బాగోగుల ప్రచారం, ప్రతీ పౌరుడికి మెరుగైన, అందుబాటు ఆరోగ్య సంరక్షణ అందించేందుకు చేస్తున్న కృషిపై అవగాహన కల్పించేందుకు ప్రముఖ క్రికెటర్ ఎం.ఎస్.ధోనితో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు నేడు ప్రకటించింది.
న్యూబర్గ్ డయాగ్నాస్టిక్స్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జిఎస్కె వేలు మాట్లాడుతూ, “మా ఎదుగుదల ఆలోచనకు ఎం.ఎస్.ధోని అండ ఉంటారు, మా అభివృద్ధి ప్రణాళికలకు ఇది వ్యూహాత్మకంగా సరిపోతుంది. ఈ అనుబంధం మాలో ఉత్సాహం నింపుతోంది, ఆయన మా చెంత ఉండటం, మా ప్రచారకర్తగా, అంతర్జాతీయ బ్రాండ్ అంబాసిడర్గా ఉండటం మేము గౌరవంగా భావిస్తాం. మేమందిస్తున్న విస్తృత స్థాయి డయాగ్నాస్టిక్స్ సేవలను దేశమంతటా విస్తరించదలిచాం, అంతే కాదు అందుబాటులో మెరుగైన ఆరోగ్య సంరక్షణను ప్రతీ పౌరుడికి అందించేందుకు కృషి చేస్తున్నాం. ఆరోగ్యం, ఫిట్నెస్ విషయంలో ధోని అంకితభావం మా లక్ష్యంలో ప్రతిధ్వనిస్తుంది, అంతే కాదు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు గుర్తు చేస్తుంది. ధోని అండగా నిలవడం వలన మా అంకితభావాన్ని, సేవలను మరింత ప్రభావవంతంగా తెలియజెప్పే వెసులుబాటు కల్పిస్తుంది” అన్నారు.
భారత్ జట్టు మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎం.ఎస్.ధోని మాట్లాడుతూ, “దేశవ్యాప్తంగా చక్కని ఆరోగ్య సంరక్షణను అందించేందుకు న్యూబర్గ్ నాయకత్వం అంకితభావం కలిగి ఉంది. అది నాకు బాగా నచ్చింది. అందుబాటు ధరల్లో నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అందించేందుకు వారు, వారి బృందం చేపట్టే వివిధ కార్యక్రమాలతో మమేకం కావడం నాకు సంతోషంగా ఉంది. కొవిడ్-19 మహమ్మారి కాలంలో అన్ని వయస్సుల వారిలోనూ ఆరోగ్యం, బాగోగులపై అవగాహన కల్పించేందుకు వారు ప్రచారం చేపట్టారు. ఈ ప్రయత్నాలు చాలా ముఖ్యమని, వాటికి ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉందని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను” అన్నారు.
పెరుగుతున్న విస్తరణతో కంపెనీ బలమైన వృద్ధిని చూస్తోంది. ప్రారంభించిన నాలుగు సంవత్సరాల కాలంలోనే మూడు ఖండాల్లో ఎదిగి ఆర్థిక సంవత్సరం 21లో రూ.800 కోట్ల రాబడిని చూసింది. అంతే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 200లకు పైగా ల్యాబులు, 3000లకు పైగా కలెక్షన్ సెంటర్ల ద్వారా అందిస్తున్న విభిన్నమైన సేవలు ద్వారా ఆర్థిక సంవత్సరం 22లో ఆదాయాన్ని రూ.1000 కోట్లకు పెంచుకోవాలని లక్ష్యంగా విధించుకుంది.
యూఎపీ, దక్షిణాఫ్రికా, అమెరికాలోని అంతర్జాతీయ మార్కెట్లలోనూ ఆదాయాన్ని పెంచుకునేందుకు ఎం.ఎస్.ధోని సహకరిస్తారు.