365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుపతి,ఆగస్టు 28,2021: టిటిడి నిర్వహణలోని ఎస్వీ ఆర్ట్స్ కళాశాల, శ్రీ పద్మావతి మహిళ డిగ్రీ, పిజి కళాశాల, శ్రీ గోవిందరాజ స్వామి ఆర్ట్స్ కళాశాలల పని తీరు బాగుందని ఐఎస్ఓ సర్టిఫికేషన్ కమిటీ సభ్యులు అభినందించారు. మూడు కళాశాలలు న్యాక్ గుర్తింపు కొరకు రెండు నెలల క్రితం దరఖాస్తు చేశాయి. ఈ నేపథ్యంలో ఐఎస్ఓ సర్టిఫికేషన్ కమిటీ సభ్యులు శుక్ర, శని వారాల్లో మూడు కళాశాలలను సందర్శించారు.
శనివారం సాయంత్రం పరిపాలన భవనంలో జెఈవో సదా భార్గవితో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఐఎస్ఓ సభ్యులు మాట్లాడుతూ టిటిడి కళాశాలల్లో విద్యా ప్రమాణాలు, భవనాలు, వసతులు. పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కల పెంపకం, వ్యర్థ పదార్థాల నిర్వహణ బాగున్నాయన్నారు. తరగతి గదులు, కార్యాలయాలు, హాస్టల్ గదుల్లో కోవిడ్ – 19 ప్రోటోకాల్ అమలు బాగుందన్నారు. శ్రీ పద్మావతి మహిళ డిగ్రీ, పిజి కళాశాలలో వంటగదిని ఆకస్మికంగా పరిశీలించామని, అక్కడ నిర్వహణ పరిశుభ్రత ఆహర పదార్థాల తయారీ బాగుందన్నారు.
జెఈవో సదా భార్గవి మాట్లాడుతూ టిటిడి విద్యా సంస్థల్లో ఉన్నత విద్యా ప్రమాణాలు అందించడానికి, చక్కటి వాతావరణం ఏర్పాటు చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. ఐఎస్ఓ బృందం ఏవైనా లోపాలు గుర్తించి ఉంటే వాటిని సరిదిద్ధుకుని మరింత ఉన్నత విద్యా ప్రమాణాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటామన్నారు.