365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా, సెప్టెంబర్ 16,2021:1.పండుగ సీజన్‌ను ఈ మధ్య కాలంలో ఏ విధంగా విమర్శించటం జరుగుతోంది?
భారతదేశంలో చాలా భాగాల్లో పరిస్థితి మెరుగుపడినప్పటికీ, మహమ్మారితో మన పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది. కొనుగోలుదారులు, విక్రయ భాగస్వాములు, ఈకోసిస్టమ్ భాగస్వాములు,మా ఉద్యోగులు సురక్షితంగా ఉండటం,వారి సంక్షేమం మా ప్రాధాన్యంగా ఇప్పటికీ నిలిచి ఉన్నది. వేలాది చిన్న ,మధ్యతరహా వ్యాపారాలు,బ్రాండ్ భాగస్వాములతో కలిసి మేము మా కస్టమర్లకు విస్తృతశ్రేణిని, సౌకర్యాన్ని ,వేగవంతమైన డెలివరీని ఆఫర్ చేయటం కొనసాగిస్తున్నాము. తమ ఇంటివద్దనే సుఖంగా, సురక్షితంగా ఉంటూనే సంబరాలు జరుపుకోవాలని చూస్తున్న కొనుగోలుదారుల కోసం మేము రాబోయే పండుగ సీజన్ కోసం సంసిద్ధమవుతున్నాము. ఫ్యాషన్, గ్రోసరీ, ఇల్లు, వంటగది, స్మార్ట్ఫోన్లు, వర్క్ ఫ్రమ్ హోమ్ ,స్టడీ ఫ్రమ్ హోమ్ కోసం కావలసిన అత్యవసరసామాగ్రులు, ఇంకా మరిన్ని రకాల ఉత్పత్తుల విస్తృతశ్రేణి కోసం కొనుగోలుదారులు, అగ్రశ్రేణి బ్రాండ్లలో మహత్తరమైన డీల్స్, ఆఫర్ల కోసం వెదకవచ్చు.స్థానిక దుకాణాలు, పనివారలు, సహేలీ ఎంటర్ప్రెన్యూర్లతో సహా వేలాదిమంది చిన్నతరహా వ్యాపారవర్గాలవారికి, కష్టకాలంలో వారి వ్యాపారాలకు సహాయం చేస్తూ, వారి నుండి షాపింగ్ చేసే అవకాశాలను కొనుగోలుదారులు వెదకవచ్చు.
డిమాండును పరిశీలించి చూస్తే, ఈ సీజన్ మంచి బలంగా ఉండగలదని మేము భావిస్తున్నాము. మా విక్రేతలు సిద్ధమవుతున్న పద్ధతిని, మేము సృష్టించిన మౌలికసదుపాయాలను, సహకారాన్ని గమనించినట్లయితే, ఈ దీపావళి మా విక్రేతలకు మాత్రమే కాక మా వినియోగదారులకు కూడా చాలా బాగుండగలదని మేము విశ్వసిస్తున్నాము.
దేశంలో సుదూర ప్రాంతాలలో అత్యుత్తమమైన ఎంపిక ,కస్టమర్ షాపింగ్ ఆన్లైన్ అనుభవం తప్పక లభించే విధంగా మేము మా దృష్టిని కేంద్రీకరించటం కొనసాగిస్తాము.
2.ఈ పండుగ సీజన్లో కొనుగోలు వైఖరి ఏ విధంగా భిన్నంగా ఉండగలదని మీరు భావిస్తున్నారు?
ఈ పండుగ సీజన్ మాకు ఇప్పటికే ప్రారంభం అయ్యింది, ఇటీవలే మేము ఓణమ్, రాఖీ షాపింగ్‌లను A.in పై ముగించాము. విక్రేతలు, వినియోగదారులు,విభాగాలు అనే మూడు కోణాల్లోనూ మేము సరికొత్త వైఖరులను గమనించాము.
ఇక విక్రేతల విషయానికి వస్తే, మరిన్ని స్థానిక దుకాణాలు ఆన్లైన్లో విక్రయాల కోసం ముందుకు వస్తున్నాయి. ఈ వైఖరిని మేము గత కొద్ది నెలలుగా గమనిస్తున్నాము. దీపావళి పండుగ సందర్భంగా ఇది అత్యధిక స్థాయికి చేరుకోగలదని మేము విశ్వసిస్తున్నాము. మరొక విషయం ఏమిటంటే, ఆన్లైన్లో విక్రయించేందుకు ముందుకు వస్తున్న విక్రేతలు చాలా మంది, A.in పై షాపింగ్ చేసే కొనుగోలుదారుల మిశ్రమాన్ని పోలి ఉండే విదంగా, చిన్న పట్టణాలకు చెందినవారు. ఇక విభాగాల విషయానికి వస్తే, కొనుగోలుదారులు ఆన్లైన్ షాపింగ్ చేయటం మొదలుపెట్టినప్పటినుండి వేగాన్ని అందుకున్న విక్రయాలు కిరాణా సామాగ్రులు. గత 12 నెలల కాలంలో విపరీతంగా విక్రయాలు పెరిగిన కొన్ని కొత్త విభాగాల్లో పర్సనల్ గ్రూమింగ్ (వ్యక్తిగత సౌందర్యసాధనాలు), క్రీడా సామాగ్రులు మొదలైనవి; చాలా విభాగాలు అభిరుచులకు అనుబంధమైనవి. ఈ విభాగాలు గత 18 నుండి 20 నెలల మధ్యలో అభివృద్ధి చెందాయి. ఈ ట్రెండ్ దీపావళి సమయంలో అత్యధిక స్థాయికి చేరుకోగలదని మేము భావిస్తున్నాము. అంతే కాక, ఫ్యాషన్,సౌందర్యసాధనాలు, ఎలక్ట్రానిక్స్,నిత్యావసరాల విస్తృతమైన వ్యాపారాలలో, గత ఏడాది దీపావళి తరహాలోనే ట్రెండ్లు ఉండగలవని మేము భావిస్తున్నాము.
3.2-3వ శ్రేణి మార్కెట్లలో అభివృద్ధి ఎంత ఉన్నది?
గత 15 నుంచి 18 నెలలుగా, చాలా మంది కొనుగోలుదారులు ఆన్లైను వైపుకు మళ్ళటం మేము గమనించాము.దాదాపు 65 శాతం మంది కస్టమర్ ఆర్డర్లు, Amazon.inపై 85 శాతం మంది కొత్త కొనుగోలుదారులు 2వ శ్రేణి,అంత కన్నా దిగువ శ్రేణి ప్రాంతాలకు చెందినవారు. భారతదేశంలో సేవలు అందించగలిగిన 100 శాతం పిన్ కోడ్ల వ్యాప్తంగా ఉన్న కస్టమర్లు మా వద్ద నుండి షాపింగ్ చేస్తున్నారు. 85 శాతానికి పైగా ట్రాఫిక్ మొబైల్ నుంచి వచ్చాయి. 2వ శ్రేణి,అంతకు దిగువ శ్రేణి ప్రాంతాలకు చెందిన విభాగాలలో అద్భుతమైన అభివృద్ధి మాకు ఈ దిగువ విభాగాల్లో కనిపించింది:
oకిరాణా:అమెజాన్ పాంట్రీ పై మొదటిసారి కొనుగోలు చేసేవారి సంఖ్య రెండింతలు అయ్యింది + తాజాగా కోవిడ్ అనంతరం, 2/3 పట్టణాలకు చెందిన కొత్త కస్టమర్ల వాటాలో 60 శాతానికి పైగా వాటా
oLA & F: ఉపకరణాలు,ఫర్నీచర్ల అతి పెద్ద సెలక్షన్లను మేము ఆఫర్ చేస్తున్నాము. పెద్ద ఉపకరణాల యూనిట్ విక్రయాల్లో 60 శాతం పెరుగుదల, కుర్చీలు, బల్లలు, మొదలైన ఆఫీసు ఫర్నీచర్ విభాగంలో 90 శాతం పెరుగుదల మాకు కనిపించింది. మార్చ్ 21తో పోలిస్తే వాషింగ్ మెషీన్ల డిమాండ్ పెరుగుదలలో 1.5 రెట్ల పెరుగుదల కనిపించింది. ఇందులో సగానికి పైగా పెరుగుదల మెట్రోయేతర ప్రదేశాలు,2వ శ్రేణి పట్టణాలనుండి లభిస్తోంది.
ఈ పట్టణాల్లో మరింత ఎక్కువ మందిఆన్లైన్లో షాపింగ్ చేస్తూ సౌకర్యాన్ని పొందుతూండటంతో, ఇక్కడ వినియోగం మరింత బలోపేతం అవుతోంది. ఇది మాకు చాలా ముఖ్యమైన విషయం. కస్టమర్ల గురించి మేము మాట్లాడినప్పుడల్లా, ఆ కస్టమర్ , లావాదేవీ విలువను మేము పరిగణనలోకి తీసుకోము. కొనుగోలుదారు ఆన్లైన్ షాప్ చేసేందుకు, రానున్న ఏళ్ళలో వారు ఆన్లైన్లో ఇంకా ఏమి చేయగలరో చూసేందుకు మేము బంధం విలువను పరిగణనలోకి తీసుకుంటా,ము.
4.మీరు పండుగ సీజన్ కోసం సిద్ధంగా ఉన్నారా?
మనందరికీ తెలుసిన కారణాల దృష్ట్యానే ఈ పండుగ సీజన్ ఒక సాధారణమైన పండుగ సీజన్ కాదు. మా విజయానికి కొలమానం, మా విక్రేతలను ఎంత విజయవంతం చేస్తామనే దానిపై కేంద్రీకృతమై ఉన్నది. వేలాది మంది చిన్న, మధ్యతరహా వ్యాపార ,బ్రాండ్ భాగస్వాములతో కలి మేము మా కస్టమర్లకు విస్తృతమైన ఎంపికలను, సౌకర్యాన్ని,వేగవంతమైన డెలివరీని కొనసాగిస్తాము.
ఇప్పుడు మేము చేస్తున్నదేమిటంటే, మా మౌలికసదుపాయాలను మేము వేగంగా సమీకరిస్తున్నాము. వేర్‌హౌస్ స్పేస్ పరంగా –మేము తాజాగా పెద్ద సంఖ్యలో కొత్త వేర్‌హౌస్‌లను ప్రారంభించాము. ఫీల్డ్‌లో పనిచేస్తున్న మా ఉద్యోగులందరికీ టీకాలను ఇప్పించాము. ఇక కస్టమర్ విషయానికి వస్తే, మరిన్న కొత్త భాషలను ప్రవేశపెట్టటంతో సహా బోలెడన్ని ఆవిష్కరణలను మేము చేశాము.
మేము అంతా పండుగ సీజన్ కోసం సిద్ధంగా ఉన్నాము, మా కస్టమర్లకు అవసరమైన వాటిని వేటినైనా, ఏ సమయంలోనైనా,భారతదేశంలో ఎక్కడనుండైనా సరే అందజేసేందుకు సిద్ధంగా ఉన్నాము.
5.ఈ సంవత్సరం పండుగ నుండి మీరు ఆశిస్తున్నది ఏమిటి?
మా విక్రేతలు సిద్ధమవుతున్న పద్ధతిని, మేము సృష్టించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్,సహాయసహకారాలను గమనించినట్లయితే, ఈ దీపావళి విక్రేతలకు, ఇంకా మా వినియోగదారులకు కూడా మంచిది కాగలదని మేము విశ్వసిస్తున్నాము. ఫ్యాషన్,సౌందర్యసాధనాలు, కిరాణాసామాగ్రులు, స్మార్ట్ఫోన్లు, టివిలు, ల్యాప్‌టాప్‌లు, ఉపకరణాల వంటి మరిన్ని విభాగాలకు చెందిన వివిధరకాల ఉత్పత్తులను తమ ఇంటి వద్దనే సౌకర్యవంతంగా, సురక్షితంగా ఉండి షాపింగ్ చేసేందుకు కస్టమర్లు ఎదురుచూడవచ్చు.
6.పండుగ సీజన్ సందర్భంగా కస్టమర్ల డిమాండును అందుకోగలిగేందుకు మీ మౌలికసదుపాయాలను మీరు ఏ విధంగా పటిష్టం చేస్తున్నారు?
దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 8.5 లక్షల మంది విక్రేతలకు సహాయసహకారాలను అందజేసేందుకు 2020తో పోలిస్తే స్టోరేజ్ సామర్ధ్యాన్ని మేము ఇటీవలే 40 శాతం విస్తృతం చేశాము. గుర్‌గ్రామ్, హర్యాణాలో 7వ ఫుల్ఫిల్మెంట్ కేంద్రాన్ని ప్రారంభించటంతో, అమెజాన్ ఇండియాకు మహారాష్ట్ర, బీహార్, గుజరాత్, అస్సాం, రాజస్థాన్, హర్యాణా, ఉత్తర ప్రదేశ్‌లతో సహా మరిన్ని ప్రదేశాల్లో 60కి పైగా ఫుల్ఫిల్మెంట్ కేంద్రాలను కలిగి ఉంది. 2021లో మేము మా నెట్వర్కును, 43 మిలియన్ ఘనపుటడుగుల స్టోరేజ్ సామర్ధ్యాన్ని అందజేసేందుకు విస్తరింపజేశాము, వేలాదిమందికి ప్రత్యక్ష ,అప్రత్యక్ష రూపంలో ఉద్యోగావకాశాలను సృష్టింపజేశాము. హర్యాణాలో కొత్త ప్రత్యేక FC 1.5 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో వ్యాపించి ఉండి 2 మిలియన్ ఘనపుటడుగులకు పైగా స్టోరేజ్ సామర్ధ్యాన్ని, 45,000 మందికి పైగా విక్రేతలకు అందించింది. రకరకాల ఉపకరణాలు , ఫర్నీచర్ విభాగానికి చెందిన ఉత్పత్తులను ఇది నిల్వ చేసేందుకు ఉపయోగపడుతుంది.
పండుగ సీజన్‌కు ముందు, దేశం నలుదిశల్లో చిరునవ్వులను చిందింపజేసేందుకు మేము మా నెట్‌వర్క్‌ను విస్తరింపజేస్తున్నాము. 1700కు పైగా అమెజాన్ స్వంతమైన ,28,000లకు పైగా భాగస్వాముల డెలివరీ స్టేషన్లతో, స్పేస్ స్టోర్ భాగస్వాములుండగా, 350 పట్టణాల్లో డెలివరీ సేవల భాగస్వాములు, 65 పట్టణాల్లో ఫ్లెక్స్ భాగస్వాములతో ఒక బలమైన నెట్వర్కును కలిగి ఉండి, మా కస్టమర్లకు అద్భుతమైన షాపింగ్ అనుభవాన్ని అందించేందుకు సంసిద్ధంగా ఉన్నాము.