EXTENSION OF BUS PASSESEXTENSION OF BUS PASSES
EXTENSION OF BUS PASSES
EXTENSION OF BUS PASSES

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్ ,సెప్టెంబర్ 29,2021:2021 సంవత్సరానికి గాను జర్నలిస్ట్ పాస్ లను జారీచేయు సాఫ్ట్ వేర్ లో అవసరమైన మార్పులను చేసి 30.09.2021 వరకు చెల్లుబాటులో ఉన్న జర్నలిస్ట్ పాస్ ల కాల వ్యవధిని మరో 3 నెలల వరకు పొడిగించి 31.12.2021 చెల్లుబాటు అయ్యే విధంగా పునరుద్ధరించడం జరిగింది. ఈ పాస్ లను పొందే సమయంలో పత్రికా ప్రతినిధులు ఈ క్రింది విషయాలను గమనించగలరు.

  1. రీజియన్‌లోని పత్రికా ప్రతినిధులు జర్నలిస్ట్ పాస్‌లు పొందడానికి సంబధిత
    ఏదైనా బస్ పాస్ సెంటర్‌ నుండి, జంటనగరాలకు సంబంధించిన పత్రికా
    ప్రతినిధులు గ్రేటర్ హైదరాబాద్ జోన్‌లో ఏదైనా సెంటర్‌ నుండి
    జర్నలిస్ట్ పాస్ పొందవచ్చును.
  2. ప్రస్తుతం కలిగిఉన్న అక్రిడిషన్ కార్డును చూపించి,
    30.09.2021 వరకు గడువు తేదీ ఉన్న ప్రస్తుత గుర్తింపు కార్డును బస్ పాస్
    కౌంటర్ ఆపరేటర్‌కు అందజేయాలి. 
  3. అవసరమైన సర్వీస్ ఛార్జీని చెల్లించి 31.12.2021 వరకు
    చెల్లుబాటులో ఉండే కొత్త గుర్తింపు కార్డును పొందవచ్చును.
EXTENSION OF BUS PASSES
EXTENSION OF BUS PASSES

ఏవైనా సందేహాలు, అసౌకర్యం కలిగినచో జంటనగరాలకు సంబంధించిన పత్రికా
ప్రతినిధులు శ్రీ రమణ మూర్తి, 9959225229 నంబరును, జిల్లాపరిధి లోని పత్రికా
ప్రతినిధులు సంబంధిత రీజియన్లోని పర్సనల్ ఆఫీసర్ గారిని సంప్రదించగలరు.