Wed. Jan 15th, 2025

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,నవంబర్ 12, 2021:”ఊరికి ఉత్తరాన”సినిమాలో కొన్ని సీన్స్ వివాదాస్పదమవుతు న్నాయి.తెలంగాణను కించపరిచే సన్నివేశాలున్నాయంటూ కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఆందోళన చేపట్టింది. తెలంగాణ రాష్ట్ర చిహ్నమైన కాకతీయ తోరణానికి వ్యక్తిని కట్టి తల క్రిందులుగా తీసే సన్నివేశంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ).

తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిచేలా ఉన్న ఈ సన్నివేశాన్ని తొలగించాలని, లేని పక్షంలో సినిమాను అడ్డుకుంటామని కాకతీయ యూనివర్సిటీ (కేయూ)విద్యార్థి జేఏసీ హెచ్చరించింది. ఈ సందర్భంగా కాకతీయ యూనివర్సిటీ జేఏసీ కి చెందిన విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేశారు.

Tollywood: వివాదంలో "ఊరికి ఉత్తరాన" చిత్రం... ఆ సన్నివేశాన్ని  తొలగించాలంటున్న తెలంగాణ వాల్మీకి సంఘ నాయకులు - OK Telugu
error: Content is protected !!