Mon. Nov 25th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,నవంబర్‌ 25,2021 ః ఇన్‌స్టాగ్రామ్‌ నేడు తెలుగు భాషలో తమ ప్రకటనా చిత్రం విడుదల చేసింది. దీనిద్వారా తెలంగాణా రాష్ట్రంలోని యువతను తమ వేదికపై తమ వ్యక్తిగత గాథలను వ్యక్తీకరించడంతో పాటుగా అన్వేషించాల్సిందిగా ఆహ్వానిస్తుంది. ఈ చిత్రం ఇన్‌స్టాగ్రామ్‌ ఇటీవల ప్రారంభించిన కన్స్యూమర్‌ మార్కెటింగ్‌ ప్రచారం ‘ వియ్‌ ఆర్‌ ఇన్‌ ద మేకింగ్‌’ లో భాగం. ఈ వారం నుంచి ఇది టీవీలో కనిపించనుంది.

ఇన్‌స్టాగ్రామ్‌తో తాము ఎవరనేది అన్వేషించే విధానాన్ని ‘వియ్‌ ఆర్‌ ఇన్‌ ద మేకింగ్‌’ ప్రచారం వెల్లడిస్తుంది. యువత తమను తాము వ్యక్తీకరించుకుంటుంది ,కమ్యూనిటీలో భాగం కావాలనుకుంటుంది కానీ తమ చుట్టూ ఉన్న వారి నుంచి నిరంతర ప్రోత్సాహమూ కోరుకుంటుందనే అంశం ఆధారంగా దీనిని రూపొందించారు. యువత వరకూ  గుర్తింపు అనేది నిర్వచించబడలేదు, ఈ గుర్తింపు అనేది నిత్యం అన్వేషించతగ్గ అంశం, ఏ విధంగా మన పనులు ముందుకు సాగుతున్నాయనే అంశంతో దీనికి సంబంధం లేదనే  వాస్తవం ఆధారంగా ఈ  ప్రచారాన్ని  తీర్చిదిద్దారు.

అవినాష్‌ పంత్‌, డైరెక్టర్‌-మార్కెటింగ్‌, ఫేస్‌బుక్‌ ఇండియా ఈ అంశం గురించి మరింతగా వెల్లడిస్తూ ‘‘రీల్స్‌తో మేము లఘు రూపంలో వీడియో సృష్టికర్తలను గణనీయమైన సంఖ్యలో చూశాం. వారు తమ ఆసక్తులను మరింతగా కనుగొనడంతో పాటుగా తమ గొంతునూ కనుగొంటూనే జాతీయ స్ధాయిలో ప్రాచుర్యమూ పొందారు. ఇన్‌స్టాగ్రామ్‌ ప్రారంభించిన ఈ నూతన ప్రచారం ద్వారా ఈ స్థానిక పరిజ్ఞానం తీసుకురావడంతో పాటుగా బహుముఖమైన నేటి తరాన్ని వేడుక చేస్తున్నాము. తెలంగాణాలోని యువత తమను తాము వ్యక్తీకరించుకోవడంతో పాటుగా ఇన్‌స్టాగ్రామ్‌పై తమకు తాము ఓ ఆకృతినీ అందించుకోవడానికి ఈ ప్రచారం ప్రోత్సహించనుందని మేము ఆశిస్తున్నాము’’ అని అన్నారు.

రీల్స్‌ వినియోగం వల్ల   గత సంవత్సర కాలంగా వెలుగులోకి వచ్చిన నూతన క్రియేటర్ల లో కనిపిస్తున్న బ్రాడ్‌కాస్టింగ్‌ సంస్కృతి  వృద్ధి చెందడం నుంచి కూడా  ఈ ప్రచారం స్ఫూర్తినొందింది. దీనిలో దక్షిణ భారతదేశం నుంచి క్రియేటర్లలో నిర్మల్‌ పిల్లై (@mahlyf_mahrulez), సత్సాయా (@satshyaa/), అభిషేక్‌ కుమార్‌ (@theabhishekkumar), డెవిల్‌ కుంజు(@thatdevilkunju)  వంటి వారు ఉన్నారు.

ఈ ప్రచారం హైదరాబాద్‌లో భౌతికంగా కూడా  జరుగుతుంది. ఇది ఇంటరాక్టివిటీ ,ఎంగేజ్‌మెంట్‌కు కేంద్రంగా ఉపయోగపడుతుంది. తద్వారా ఈ  వేదికపై వారి వ్యక్తిగత కథనాలను వ్యక్తీకరించడానికి,అన్వేషించడానికి నగరంలోని యువకులను ప్రోత్సహించడానికి తోడ్పడుతుంది.

తెలంగాణా నుంచి ఈ ప్రచారం అప్‌డేట్స్‌ చూడటానికి , భారతదేశ వ్యాప్తంగా ఈ ప్రచారం గురించి తెలుసుకోవడానికి #InTheMaking and #MakeTheReelYou.. అనుసరించండి.

error: Content is protected !!