365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,డిసెంబర్ 4,2021: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా టిటిడి బోర్డు సభ్యులు, చంద్రగిరి ఎమ్మెల్యే డా. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి శనివారం పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయం వద్ద డా. భాస్కర్‌రెడ్డికి జెఈవో శ్రీ వీరబ్రహ్మం సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో గజ వాహనం సందర్భంగా తుమ్మలగుంటలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం నుంచి పట్టువస్త్రాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. తుమ్మలగుంట నుంచి తిరుచానూరుకు పాదయాత్రగా వచ్చి పట్టువస్త్రాలు సమర్పించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి కస్తూరిబాయి, ఏఈవో ప్రభాకర్‌రెడ్డి, ఆగమ సలహాదారు శ్రీనివాసాచార్యులు, అర్చకులు బాబుస్వామి పాల్గొన్నారు.
రెండు గొడుగులు విరాళం
తమిళనాడులోని తిరునిన్రవూరుకు చెందిన శ్రీమద్ రామానుజ కైంకర్య ట్రస్టు ప్రతినిధులు రెండు గొడుగులను కానుకగా అందించారు. ఈ గొడుగులను ఆలయం వద్ద టిటిడి జెఈవో శ్రీ వీరబ్రహ్మంకు అందించారు. బ్రహ్మోత్సవాల్లో గజ వాహనం రోజున ఈ ట్రస్టు తరఫున గొడుగులు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది