365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ముంబై, డిసెంబర్ 8, 2021:భారతదేశంలో మొట్టమొదటి పోర్టబల్‌ మాలిక్యులర్‌ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసే యంత్రం ఉదజ్‌ను నేడు సుప్రసిద్ధ భారతీయ చిత్ర నటి, సోషల్‌ వర్కర్‌ భాగ్యశ్రీ ఆవిష్కరించారు. భావితరపు వ్యక్తిగత వెల్‌నెస్‌ ఉపకరణంను అత్యాధునిక ఫీచర్లతో  రూపొందించారు. దేశవ్యాప్తంగా వినియోగదారుల వ్యక్తిగత వినియోగం కోసం ఇది లభ్యమవుతుంది. ఈ యంత్రంలో ప్రత్యేకత ఏమిటంటే ఒకేసారి ఇద్దరు ఇన్హేల్‌ చేసే వీలు దీనిలో ఉంది.

‘‘ఈ మెషీన్‌ వినియోగించిన తరువాత నేను మరింత ఆరోగ్యంగా ఉన్నానన్న భావన కలిగింది. నిర్ధిష్టమైన శారీరక సమస్యలు నయం  చేయడం  లేదా పరిష్కరించాలని నేను కోరుకోలేదు. కానీ  నా మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచాలనుకున్నాను. హోమియోస్టాసిస్‌ అనేది ప్రతిరోజూ ఒక గంట ఇన్హేలర్‌ చేసుకున్న తరువాత పొందే భావాన్ని వివరించడానికి ఒక అత్యుత్తమ పదం అని అనుకుంటున్నాను’’అని ఉదయ్‌ను తొలిసారిగా వినియోగించిన వెంటనే భాగ్యశ్రీ తన అనుభవాలను పంచుకున్నారు.

వెల్‌నెస్‌ పరిశ్రమలో తాజాగా వినిపిస్తోన్న పదం మాలిక్యులర్‌ హైడ్రోజన్‌. నివారణ ఆరోగ్య ఉపకరణంగా దీనిని భావిస్తున్నారు. గాలిలో హైడ్రోజన్‌ చాలా స్వల్ప పరిమాణంలో లభిస్తుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేయడంతో పాటుగా శరీరంలోని కణజాలం నష్టపోకుండా కాపాడుతుందనే భావన ఉంది. అతి తక్కువ కాన్సన్‌ట్రేషన్‌తో హైడ్రోజన్‌ను గ్యాస్‌ రూపంలో పీల్చవచ్చు.

‘‘మన మైటోకాండ్రియాలో ఆక్సీకరణ ఒత్తిడికి దారితీసేవి ఫ్రీ రాడికల్స్‌. ఇవి మన డీఎన్‌ఏతో పాటుగా మన ఫండమెంటల్‌ ప్రోటీన్స్‌పై మాలిక్యులర్‌ స్ధాయిలో తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. ప్రస్తుతం అత్యంత శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌లలో ఒకటిగా మాలిక్యులర్‌ హైడ్రోజన్‌ నిలుస్తుంది. ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరించడంతో పాటుగా ఆక్సిడేటివ్‌ ఒత్తిడిని సైతం తగ్గిస్తుంది. చర్మ సౌందర్యం మెరుగుపరచడంతో పాటుగా ఊపిరితిత్తులు సరిగా పనిచేసేందుకు సైతం తోడ్పడుతుంది’’అని డాక్టర్‌ బాబు సుధాకర్‌, ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సెరెన్‌ ఎన్విరోటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ముంబై అన్నారు.