365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,డిసెంబరు 18,2021: తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఏకాంతంగా జ‌రుగుతున్న తెప్పోత్సవాల్లో భాగంగా మూడో రోజైన శుక్ర‌వారం సాయంత్రం శ్రీ సోమ‌స్కంద‌స్వామివారికి కొలువు నిర్వ‌హించారు.

సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఊంజ‌ల్ మండ‌పంలో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ సందర్భంగా వేద‌పండితులు వేద పారాయ‌ణం, టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్న‌మ‌య్య సంకీర్త‌న‌లు ఆలపించారు.

అదేవిధంగా శ‌నివారం శ్రీ కామాక్షి అమ్మ‌వారికి కొలువు నిర్వ‌హిస్తారు.