
365తెలుగు.కామ్ ఆన్లైన్ న్యూస్,ఢిల్లీ,జనవరి 24,20222: మారుతి సుజుకి, టయోటా సంస్థల భాగస్వామ్యంలో సరికొత్త ఎలక్ట్రిక్ వెహికల్ ను రూపొందించేందుకు సిద్ధమయ్యాయి. ఈ వెహికల్2024లో మార్కెట్ లోకి అందుబాటులోకి తెచ్చేపనిలో పడ్డాయి రెండు సంస్థలు. మారుతి దీనికి YY8 అని కోడ్‌నేమ్ కూడా పెట్టేసింది.

TATA పంచ్ EVకి ధీటుగా ఉండేలా ఈ వాహనాన్ని తీసుకురానున్నట్లు సమాచారం. గుజరాత్ లోని సుజుకి తయారీ కేంద్రంలో YY8 ఉత్పత్తి చేయనున్నారు. ప్రతి సంవత్సరం1.5 లక్షల యూనిట్ల అమ్మకాలు జరపాలనే లక్ష్యాన్ని కూడా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.